శుభలక్ష్మి శర్మ

జార్ఖండ్ కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి

శుభలక్ష్మి శర్మ, జార్ఖండ్కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] కుడిచేతి బ్యాటర్, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్.[2] జార్ఖండ్ నుండి భారతదేశం తరపున ఆడిన మొదటి మహిళా క్రికెటర్ గా నిలిచింది.

శుభలక్ష్మి శర్మ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1989-12-31) 1989 డిసెంబరు 31 (వయసు 34)
హజారీబాగ్, జార్ఖండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 80)2014 ఆగస్టు 13 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 101)2012 మార్చి 16 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2014 నవంబరు 28 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 31)2012 ఫిబ్రవరి 23 - వెస్టిండీస్ తో
చివరి T20I2015 జూలై 13 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 1 10 18
చేసిన పరుగులు 4 11 25
బ్యాటింగు సగటు 4.00 8.50 3.57
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 4 4 10
వేసిన బంతులు 108 456 324
వికెట్లు 4 7 15
బౌలింగు సగటు 8.50 48.42 19.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/12 2/17 3/12
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 3/–
మూలం: ESPNcricinfo

జననం మార్చు

శుభలక్ష్మి శర్మ 1989, డిసెంబరు 31న జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జన్మించింది. హజారీబాగ్ లోని కార్మెల్ గర్ల్స్ హైస్కూల్ లో చదువుకున్నది.[3]

తన సోదరులు, స్నేహితులతో ఆడుకునేటప్పుడు, శుభలక్ష్మి ఎప్పుడూ బౌలింగ్ చేస్తుండేది. అలా బౌలింగ్ లో పట్టు సాధించింది.

క్రికెట్ రంగం మార్చు

దేశీయ క్రికెట్ లో మిథాలీ రాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి, గుర్తింపు పొందింది. జార్ఖండ్‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ భారతీయ రైల్వేస్‌కు ఆడి, ఆ తరువాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.

2014 ఆగస్టు 13న ఇంగ్లాండ్ తో తన ఏకైక టెస్టు ఆడింది.[4]

2012 మార్చి 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టింది.[5] 2014 నవంబరు 28న దక్షిణాఫ్రికాతో తన చివరి వన్‌డే అడింది.[6]

2015 జూలై 13 - న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టింది.[7] 2012 ఫిబ్రవరి 23న వెస్టిండీస్ తో తన చివరి టీ20 ఆడింది.[8]

మూలాలు మార్చు

  1. "Shubhlakshmi Sharma India". ESPNcricinfo. Retrieved 2023-08-10.
  2. "Subhlaxmi Sharma Profile". BCCI portal. Archived from the original on 2013-10-17. Retrieved 2023-08-10.
  3. "Shubhlakshmi Sharma Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  4. "ENG-W vs IND-W, India Women tour of England 2014, Only Test at Wormsley, August 13 - 16, 2014 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  5. "IND-W vs AUS-W, Australia Women tour of India 2011/12, 3rd ODI at Mumbai, March 16, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  6. "IND-W vs SA-W, ICC Women's Championship 2014-2016/17, 3rd ODI at Bengaluru, November 28, 2014 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  7. "IND-W vs WI-W, India Women tour of West Indies 2011/12, 4th T20I at Roseau, February 23, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  8. "IND-W vs NZ-W, New Zealand Women tour of India 2015, 2nd T20I at Bengaluru, July 13, 2015 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.