శేఖర్‌రెడ్డి యెర్ర

శేఖర్‌రెడ్డి యెర్ర, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.[1] 90ఎంఎల్, హౌస్ అరెస్ట్‌ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[2][3]

శేఖర్‌రెడ్డి యెర్ర
జననం
చంద్రశేఖర్‌రెడ్డి యెర్ర

ఫిబ్రవరి 9
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశిల్పారెడ్డి
పిల్లలువశీకర్ రెడ్డి, విహాన్ రెడ్డి
తల్లిదండ్రులుమల్లారెడ్డి - దుష్యంత

జననం, విద్య మార్చు

శేఖర్‌రెడ్డి ఫిబ్రవరి 9న మల్లారెడ్డి - దుష్యంత దంపతులకు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో జన్మించాడు.[4] హైదరాబాదులో పెరిగాడు. నాగార్జునా విశ్వవిద్యాలయం నుండి బికాం డిగ్రీ పూర్తిచేశాడు.

 
రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన బతుకమ్మ ఫిల్మోత్సవం (2021)లో శేఖర్‌రెడ్డికి సత్కారం

వ్యక్తిగత జీవితం మార్చు

శేఖర్‌రెడ్డికి శిల్పారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (వశీకర్ రెడ్డి, విహాన్ రెడ్డి) ఉన్నారు.

సినిమారంగం మార్చు

సినిమా దర్శకత్వంపై ఆసక్తివున్న శేఖర్‌రెడ్డి హైదరాబాదుకు వెళ్ళి ఫిల్మ్ డైరెక్టర్‌ అవకాశం కోసం ప్రయత్నాలు చేశాడు. 2007లో సినీ దర్శకుడు చంద్ర మహేష్ వద్దర రచన, దర్శకత్వ విభాగంలో చేరి, చంద్ర మహేష్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు పనిచేశాడు.[5] 2013లో వచ్చిన యాక్షన్ 3డి సినిమాతో పూర్తిస్థాయి కథా రచయితగా మారాడు.

2019లో విడుదలైన 90ఎంఎల్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ సినిమాతో శేఖర్‌రెడ్డికి దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. 2021లో హౌజ్ అరెస్ట్ అనే సినిమాను తీశాడు.[6]

సినిమాలు మార్చు

దర్శకుడిగా మార్చు

  1. 90 ఎంఎల్ (2019)
  2. హౌస్ అరెస్ట్ (2021)

రచయితగా మార్చు

  1. 2011: నాకు ఓ లవరుంది (సహ రచయిత)
  2. 2012: మిస్టర్ నూకయ్య (సహ రచయిత)
  3. 2013: యాక్షన్ 3డి (మాటల రచయిత)
  4. 2013: లవకుశ (కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్)
  5. 2014: ది బెల్స్ (స్క్రీన్ ప్లే, డైలాగ్స్)
  6. 2014: నేను నా స్నేహితులు
  7. 2015: ఎందుకో నచ్చావ్ (మాటల రచయిత)
  8. 2016: బంతిపూల జానకి (స్క్రీన్ ప్లే, డైలాగ్స్)
  9. 2016: నేనో రకం (సహ రచయిత)
  10. 2018: రాజుగాడు (సహ రచయిత)
  11. 2019: కలియుగం (మాటల రచయిత)

సహాయ దర్శకుడిగా మార్చు

  1. 2002: జోరుగా హుషారుగా
  2. 2003: ఇష్టపడి
  3. 2005: ఒక్కడే
  4. 2006: హనుమంతు
  5. 2007: హైదరాబాద్‌లో ప్రేమ

మూలాలు మార్చు

  1. hansindia (2019-12-06). "Sekhar Reddy Yerra". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.
  2. "All you want to know about #SekharReddyYerra". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-30. Retrieved 2021-10-09.
  3. "Sekhar Reddy Yerra". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-30. Retrieved 2021-10-09.
  4. "Tollywood Director Sekhar Reddy Yerra Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.
  5. "Director Sekhar Reddy Yerra Interview about 90ml". www.ragalahari.com (in ఇంగ్లీష్). 2020-04-18. Archived from the original on 2021-10-10. Retrieved 2021-10-10.
  6. "Sekhar Reddy Yerra Movies". timesofindia.indiatimes.com. Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.

బయటి లింకులు మార్చు