శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండసారము


శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండసారము (బాలప్రియ వ్యాఖ్యాసహితము) ఒక తెలుగు రచన. ఇది పోలూరి హనుమజ్జానకీరామశర్మ గారిద్వారా రచించబడి, శ్రీ రమణాశ్రమము, తిరువణ్ణామలై ప్రచురించబడినది.[1]

శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండసారము
కృతికర్త: పోలూరి హనుమజ్జానకీరామశర్మ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ప్రబంధం
విభాగం (కళా ప్రక్రియ): భక్తిసాహిత్యం
ప్రచురణ: శ్రీ రమణాశ్రమము, తిరువణ్ణామలై
విడుదల: 1982, 1992

ఇది పరశురామ, దత్తాత్రేయ సంవాదాత్మకముగా ప్రారంభింపబడి హారితాయనునిచే రచింపబడినట్టి శాక్తాద్వైత ప్రబందము.

ఇతర వ్యాఖ్యానములు మార్చు

ఈ త్రిపురారహస్యజ్ఞానఖండమునకు సంస్కృతాంధ్రములలో మహానుభావు లనేకులనేక వ్యాఖ్యానముల నొనర్చి యుండిరి అందు:-

  1. శ్రీనివాసబుధవిరచిత తాత్పర్యదీపికాఖ్య సంస్కృతవ్యాఖ్య కాశీలో 1927, 1928, 1933 సంవత్సరములలో ముద్రితమైనది.
  2. శ్రీ మంధా లక్ష్మీనరసింహముగారిచే అద్వైతసుధాసారమను నాంధ్రవ్యాఖ్యతో అమలాపురములో 1923 సంవత్సరములో ముద్రితమైనది.
  3. శ్రీ అంకరాజు సరోజినీదేవిగారిచే శ్రీ మూల్పూరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి త్రిపురారహస్యప్రవచనములు తెలుగులో విరచితములై 1969 సంవత్సరములో కొల్లూరులలో ముద్రితములైనవి.
  4. శ్రీ నారు నాగనార్యులచే నాంధ్రపద్యప్రబంధముగా విరచితమై చిత్తూరులో 1970 సంవత్సరములో ముద్రితమైనది.

విషయసూచిక మార్చు

1. రమణ స్మరణము; 2. బ్రహ్మ విద్యాలంకార బ్రహ్మశ్రీ ముదిగొండ వేంకటరామశాస్త్రిగారి యభిప్రాయము; 3. భూమిక; 4. పీఠిక: భార్గవరాముని పూర్వచరిత్ర, నిర్వేదము, దత్తాత్రేయుని సందర్శనము, సృష్ఠి క్రమమునుగూర్చి, భార్గవుని సందేహములు; 5. త్రిపురామాహాత్మ్యము; 6. జ్ఞానఖండము: i. విచారోదయము, ii. విచారమాహాత్మ్యము, iii. సత్సంగమాహాత్మ్యము, iv. సత్సంగఫలము, v. బందాఖ్యాయిక, vi. శ్రద్ధా ప్రశంస, vii. ఈశ్వర నిరూపణము, viii. సంసారాఖ్యాయికావివరణము, ix. హేమచూడుని విశ్రాంతి, x. హేమచూడుని జీవన్ముక్తి, xi. జగత్స్వభావ నిరూపణము, xii. గండశైలోకావలోకనము, xiii. మహాసేనుని నిర్వేదము, xiv. భావనాసిద్ధి, xv. జ్ఞానఖండసారము, xvi. అష్టావక్రజనక సంవాదము, xvii. సమాధిస్థితి వివరణము, xviii. మనస్స్వరూప నిరూపణము, xix. జ్ఞానుల స్థితి - భేదములు, xx. విద్యాగీత, xxi. రాక్షసోపాఖ్యానము, xxii. శాస్త్రార్థ సంగ్రహము.

మూలాలు మార్చు

  1. పోలూరి హనుమజ్జానకీరామశర్మ (1982). శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండసారము (బాలప్రియ వ్యాఖ్యాసహితము). తిరువణ్ణామలై: శ్రీ రమణాశ్రమము.

బయటి లింకులు మార్చు