షణ్ముఖ సున్నపురాళ్ల

షణ్ముఖ సున్నపురాళ్ల - తెలుగు భాషాభిమాని. మాతృభాషపై మమకారంతో తెలుగు కవులు, రచయితలు, సాహితీవేత్తల వివరాలు సేకరించడం, తద్వారా భావితరాలకు అందించడమే ఉద్యమంగా ఎంచుకున్నాడు. అతడి కృషికి పలు జాతీయ స్థాయి అవార్డులు వరించాయి.[1]

నేపథ్యం మార్చు

అనంతపురం జిల్లా కదిరిలో షణ్ముఖ సున్నపురాళ్ల జన్మించారు. తల్లిదండ్రులు శ్రీనివాసులు, యశోద వజ్రాల ఇరువురు తెలుగుభాషోపాధ్యాయులు. ఆయన బెంగళూరులో ఎంబీఏ పూర్తిచేశాడు. బ్యాంక్ ఉద్యోగాన్ని సహితం వదులుకుని అన్నీ మార్గాల్లో సరియైన సమాచారం సేకరించి దాదాపు ఆరువందల కవుల వివరాలతో ‘తెలుగు సాహితీ మూర్తుల ముఖ చిత్రాలు రేపటి తరం కోసం’ పుస్తకం రాసాడు. అలాగే వందకుపైగా సాహితీవేత్తల జీవిత చరిత్రలు, రెండువందలకుపైగా వారి రచనలు, జయంతి, వర్ధంతి మొదలైన వివరాలతో ‘తెలుగు సాహితీ కాలచక్రం’ అనే క్యాలెండర్‌ రూపొందించాడు.[2] దీన్ని తరగతి గదిలో అందుబాటులోకి తీసుకురావడంతో ఆయా రోజుల ప్రాముఖ్యతను గురించి చర్చించే అవకాశం విద్యార్థులకు సులువవుతుంది.ఇతని కృషికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాడు.

పురష్కారాలు మార్చు

  • గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం.
  • తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ నుంచి ఉగాది పురస్కారం.

మూలాలు మార్చు

  1. "తెలుగుపై మమకారం.. అవార్డుల సత్కారం". web.archive.org. 2022-04-30. Archived from the original on 2022-04-30. Retrieved 2022-04-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Wayback Machine". web.archive.org. 2022-04-30. Archived from the original on 2022-04-30. Retrieved 2022-04-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)