సంకట దేవి మందిర్

సంకట దేవి మందిర్ (హిందీ: संकटा देवी मंदिर) లేదా శ్రీ దేవి మందిర్ పవిత్రమైన వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడి ప్రధాన దేవత సంకట దేవి (ప్రమాద దేవత). ఈ మందిరాన్ని 18వ శతాబ్దంలో బరోడా రాజు నిర్మించాడు. భారతదేశంలో సంకట దేవికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం ఇదే అని నమ్ముతారు.[1][2][3][4][5]

సంకట దేవి మందిర్
संकटा देवी मंदिर
సంకట దేవి మందిర్ is located in Varanasi district
సంకట దేవి మందిర్
వారణాశి జిల్లా పటంలో మందిరం ఉనికి
భౌగోళికం
భౌగోళికాంశాలు25°18′46″N 83°00′55″E / 25.312687°N 83.015277°E / 25.312687; 83.015277
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లావారణాశి
ప్రదేశంసంకటఘాట్, వారణాశి, భారతదేశం
ఎత్తు86.392 m (283 ft)
సంస్కృతి
దైవంసంకటదేవి
ముఖ్యమైన పర్వాలునవరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులునగారా శిల్పశైలి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ18వ శతాబ్దం
సృష్టికర్తబరోడా రాజ్యం

చరిత్ర మార్చు

18వ శతాబ్దం చివరలో, బరోడా రాజు సంకట ఘాట్‌ను నిర్మించాడు. అదే సమయంలో సంకట దేవి మందిరాన్ని కూడా నిర్మించాడు. 1825వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

ప్రాముఖ్యత మార్చు

"సంకట" అనే పేరు సంస్కృత పదం "సంకట్" (హిందీ: संकट) నుండి వచ్చింది, దీని అర్థం "ప్రమాదం". దేవత సంకట దేవి మొదట్లో మాతృక గా, పురాణాలలో ఆమెను "వికత్ మాతృక", (ఉగ్రమైన తల్లి) గా పిలిచారు.

నవరాత్రులలో, ఎనిమిదవ రోజు సంకట దేవికి అంకితం చేయబడింది. జీవితంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా లేదా సంక్షోభం నుండి ఉపశమనం పొందాలని భక్తులు దేవుడిని ప్రార్థిస్తారు. పాండవులు వనవాస సమయంలో సంకట దేవికి నివాళులర్పించినట్లు కూడా నమ్ముతారు.[1][2][3][6][7]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Sankata Ghat history". Superb India Tours. Retrieved 25 May 2015.
  2. 2.0 2.1 "Sankata Devi". Om Jai. Archived from the original on 25 మే 2015. Retrieved 25 May 2015.
  3. 3.0 3.1 "Religious significance". Karm Jyotish. Retrieved 25 May 2015.
  4. "Coordinates". latlong.net. Archived from the original on 7 ఆగస్టు 2017. Retrieved 25 May 2015.
  5. "Elevation". daftlogic.com. Retrieved 25 May 2015.
  6. "Religious importance". Temple Travel. Archived from the original on 5 ఏప్రిల్ 2015. Retrieved 25 May 2015.
  7. "Pandavas paid homage". Eastern UP Tourism. Archived from the original on 25 మే 2015. Retrieved 25 మే 2015.