సంతూర్ అన్నది పర్షియాకు సంబంధించిన తంత్రీ సంగీత వాద్యము. అఖ్రూట్ చెట్టుచెక్కతో ఈ వాద్యాన్ని తయారు చేస్తారు. కాశ్మీరుకు సంబంధించిన సంగీత వాద్యమైనా, ఉత్తర భారతమంతా కనిపిస్తుంది.[1]

తంత్రీవాద్యం
Playing range
సదేఘీ-దెహలవి-కన్సర్టినో శైలిలో ఫరామర్జ్ పయ్వర్ ఆలాపించిన సంతూర్
సాంతూర్ ఆడుతున్న మహిళ యొక్క 1830 సూక్ష్మచిత్రం.

చరిత్ర మార్చు

ప్రాచీన సంస్కృత వాఙ్మయంలో ఈ వాద్యానికి శతతంత్రి వీణ అని పేరు.[2] కాశ్మీర్ ప్రాంత ప్రజలు తమ జానపద సంగీతంలో ఈ వాద్యాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇరాన్ లోని మెసపోటామియా ప్రాంతంలో క్రీ.పూ. 1600-900 సంవత్సరాలలో వాడిన ప్రాచీన వాద్యానికి ఆధునిక రూపంగా కొందరు పరిశోధకులు ఈ వాద్యాన్ని పరిగణిస్తారు.[3] పెర్షియాలో ఇప్పటికీ వాడే వాద్యంలో 72 తంత్రులు మాత్రమే ఉంటాయి. భారత సంతూర్ లో వంద దాకా తీగలు ఉండవచ్చు. సంతూర్ కు దగ్గరగా ఉండే వాద్యాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి.

తీరుతెన్నులు మార్చు

ఈ వాద్యం ఒక సమలంబ చతుర్భుజాకారంలో ఉంటుంది. వాద్యం కింది భాగాన్ని, పక్క వరుసలను అఖ్రోట్ లేదా మేపుల్ జాతి వృక్షపు కలపతో చేస్తారు. పైన ఉండే ఆధారాన్ని ప్లైవుడ్ తో చేయవచ్చు. లోహంతో చేసిన తీగెలను(తంత్రులను) పేర్చేందుకు అడ్డంగా కలప వంతెనలను ఉంచుతారు. సూదులు లేదా మేకుల ఆధారంగా 3 లేదా 4 తంత్రులను ఒక సమూహంగా వాద్య పైభాగంలో లాగి అమర్చుతారు. వీటిని మరింత బిగువుగా లేదా వదులుగా చేసేందుకు కుడివైపున మీటలు ఉంటాయి.

సంతూర్ వాద్యకారులు మార్చు

  1. ఉల్హాస్ బాపట్(1950-2018)
  2. తరుణ్ భట్టాచార్య (జ. 1957)
  3. రాహుల్ శర్మ (జ. 1972)
  4. శివ్‌కుమార్ శర్మ (జ. 1938)
  5. అభయ్ సొపోరి
  6. భజన్ సొపోరి (జ. 1948)
  7. ఆర్. విశ్వేశ్వరన్ (1944-2007)
  8. ధనంజయ్ దైథంకర్
  9. వర్షా అగర్వాల్ (జ. 1967)
  10. నంద్‌కిశోర్ మూలే
  11. మొహమ్మద్ తిబ్బత్ బఖాల్ (1914-1982)
  12. రిజ్ రాం దేసాద్
  13. రతన్‌లాల్ టీకూ
  14. ఓంప్రకాశ్ చౌరాసియా
  15. హర్జిందర్ పాల్ సింగ్ (జ.1953)
  16. సందీప్ చటర్జీ

మూలాలు మార్చు

  1. కోర్ట్నీ, డేవిడ్. "SANTUR". చంద్రకాంత. Archived from the original on 11 ఏప్రిల్ 2020. Retrieved 11 April 2020.
  2. సంతూర్ మేజిక్
  3. హవ్ ఆల్ డిడ్ ది సొపోరిస్ ఇంప్రువైజ్ అపాన్ దెయిర్ ఫోక్ ఇన్‌స్ట్రుమెంట్
"https://te.wikipedia.org/w/index.php?title=సంతూర్&oldid=3804495" నుండి వెలికితీశారు