సంసారం సంతానం తమిళ రచయిత శివశంకరి వ్రాసిన ఒరు సింగం ముయలాగిరతు అనే నవల ఆధారంగా నిర్మించబడిన తెలుగు చలనచిత్రం. ఇదే కథాంశంతో తమిళంలో అవన్ అవళ్ అదు అనే సినిమా 1980లో నిర్మించబడింది. తెలుగులో 1981, జూలై 17న విడుదల అయ్యింది.

సంసారం సంతానం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం శోభన్‌బాబు ,
జయసుధ,
సూర్యకాంతం
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ నీలిమ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • శోభన్‌బాబు - శేఖర్
  • జయసుధ - లావణ్య
  • సీమ - మేనక
  • ప్రభాకర్ రెడ్డి
  • కె.వి.చలం
  • రమాప్రభ

సాంకేతికవర్గం మార్చు

  • కథ: శివశంకరి
  • మాటలు: ఆత్రేయ
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: ఎ.వెంకట్
  • కూర్పు: డి.వెంకటరత్నం
  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
  • దర్శకుడు: వి.మధుసూధనరావు
  • నిర్మాతలు: కె.రమేష్ బాబు, కె.ఆంజనేయులు

కథ మార్చు

ఈ కథ సరోగసీ(అద్దె గర్భం) ఆధారంగా తయారయ్యింది. శేఖర్, లావణ్యలది అన్యోన్యమైన జంట. అయితే లావణ్యకి పిల్లలు పుట్టే అవకాశం పోయింది. పిల్లల కోసం లావణ్య ఒక పథకం వేస్తుంది. తన పాతివ్రత్యానికి, తన భర్త ఏకపత్నీవ్రతానికి భంగం కలగకూడదనేది ఆమె దీక్ష. దీక్ష ఫలితంగా మేనక రంగంలోకి వస్తుంది. డబ్బు కోసమే లావణ్య చెప్పిన పని చేయడానికి మేనక మొదట్లో ఒప్పుకున్నా, రానురాను అంటే నెలలు నిండేకొలది ఆమె ఒంటరితనం సహించలేక పోతుంది. తనకూ వో తోడు ఉండాలని, మాట చెప్పి వూరడించే మనిషి ఉండాలని ఆమె తపన చెందుతుంది. మేనకకు శేఖర్ పరిచయమవుతాడు. తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

పాటలు మార్చు

మూలాలు మార్చు