సత్యనారాయణపురం (విజయవాడ)

సత్యనారాయణపురం, విజయవాడ నగరంలోని పెద్ద పేటలలో ఒకటి. ఈ పేటకు పడమరమరన ఏలూరు కాలవ, ఉత్తరాన ముత్యాలంపాడు,విజయవాడ, తూర్పున సత్యనారాయణపురం రైల్వే నివాసాలు, దక్షిణాన బావాజీ పేట, గాంధినగరం ఉన్నాయి. ఇది పూర్తిగా నివాస ప్రధానమయిన పేట. వ్యాపార వ్యవహారములు, దుకాణములు ఎక్కువగా నాగెశ్వరరావు పంతులు రొడ్డునందు ఉన్నాయి.

ఆలయాలు మార్చు

ఇక్కడ శివాలయం, రామాలయము ఉన్నాయి. ఇందులో శివాలయము పురాతనమయినది. రామాలయం 1960లలో కళ్ళెపల్లి కృష్ణంరాజుగారు కట్టించారు. ఆయనకు ఒక రైసు మిల్లు ఉండేది.ఇక్కడ ఉండు రామాలయం చాలా పురాతనం అయినది.

ముఖ్య కూడళ్ళు మార్చు

శివాజీ కేఫ్, బాబూరావు మేడ, కుక్కల మేడ, రాజన్ కిళ్ళీ షాపు మొదలగునవి. పూర్వపు కెంద్ర మంత్రి, ప్రముఖ ఇంజనీరు శ్రీ కే ఏల్ రావుగారికి ఇక్కడ ఒక చక్కటి నివాస భవనము ఉంది. ప్రస్తుతము అందులో టెలిఫొను ఎక్సెంజి ఉంది.

విద్యా సదుపాయాలు మార్చు

ఇక్కడ మునిసిపాలిటీ వారి ఏ.కె.టి.పి.ఉన్నత పాఠశాల (అంధ్రకెసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల)ఉన్నది. ఇందులో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. ఈ స్కూలును ఒకప్పుడు టి.వి.ఏస్ చలపతిరావు ఉన్నత పాఠశాల అని పిలిచేవారట. ఇది కాక, శ్రీ విజ్ఞాన విహార్ అను స్కూలుకూడా ఉంది. ఇవి కాక అనేక చిన్న చితక బళ్ళు, పాఠశాలలు చాలా ఉన్నాయి.ప్రాథమిక విద్యకొరకు ఇక్కడి పిల్లలు పేట బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు.

బాంకులు మార్చు

ఇక్కడ అన్ని ప్రముఖ బాంకు శాఖలు ఉన్నాయి. బాంకు శాఖలన్నీ కూడా దాదాపు ఒకే వీధిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న బాంకు శాఖలు స్టేట్ బాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బాంకు, ఆంధ్రా బాంకు, కార్పొరేషన్ బాంకు, ఇంగ్ వైశ్యా బాంకు, లక్ష్మి బాంకు వంటీ కూడా చాలా ఉన్నాయి.

విశేషాలు మార్చు

  • బాబురావు మేడ - ఈ పేటలోని మొట్ట మొదటి ఎత్తయిన భవనం.ఇప్పటికి కూడా ఎత్తయిన భవనాలలో ఇది ఒకటి, ఆపార్ట్ మెంటు కాని ఏకైక ఎత్తయిన భవనం.
  • కె.ఏల్.రావు మేడ - ప్రముఖ ఇంజనీరు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కె.ఎల్ రావు స్వగృహం.
  • కుక్కల మేడ - భవనపు మొదటి సొంతదారులు చాలా కుక్కలు పెంచేవారట, అందుకని ఆ భవనానికు ఆ పేరు వచ్చినది. ప్రస్తుతం, ఈ భవనం విశ్వ హిందూ పరిషత్ వారి అధీనంలో ఉంది. ఆ భవనం స్థానంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించారు.

ఇతర వివరాలు మార్చు

  • ఇక్కడ చాలాకాలంనుండి శివాజీ కేఫ్ అనే పేరుతొ ఒక కాఫీ హోటలు ఉంది.ఈ హోటలును 1950 ప్రాంతంలో దమ్మాలపాటి మాధవరావు మొదలు పెట్టారు. ఆతరువాత అది చాలా చేతులు మారినప్పటికి, అదే పేరుతో ఇప్పటికి ఉంది. ఆ హోటలు మూసివేసారు. ఐననూ, ఆ కూడలిని అదే పేరుతో పిలుస్తారు.ఈ పేరుతో ఉన్న కూడలి ఈ పేటకు ముఖ్య కూడలి.
  • ఇక్కడ ఒక ఉద్యానవనం (పార్క్) ఉంది. ఈ ఉద్యానవనం 2007లో పునరుద్ధరించారు
  • ఇక్కడ జిల్లా గ్రంథాలయం ఉంది. 1990లలో ఇక్కడ లైబ్రెరియనుగా పని చేసిన రాజేశ్వరరావు విశేష కృషి జరిపి, ఈ గ్రంథాలయానికి చక్కటి భవనం కట్టించారు.
  • ఒక్క సినిమా హాలు కూడా లేని పేటలలో ఇది ఒకటి.
  • ఈ మధ్య వరకు (2004సం. వరకు), సత్యనారాయణపురానికి ప్రత్యేక రైలు స్టేషను ఉండేది. రాకపొకలకు ఆడ్డంగా ఉండుట వలన (ఆ రైలు మార్గం మీద 5 గేట్లు వేయుటవలన రాకపొకలకు అంతరాయం) ఆ స్టేషనును తొలగించారు. స్టేషన్ను రైలు పట్టాలను తొలగింఛి, మునుపు పట్టాలు ఉన్న చోటునుండి రామవరప్పాడు వరకూ ఒక రహదారి నిర్మించారు

మూలాలు మార్చు