డా. సరోజ్ బజాజ్ సామాజిక కార్యకర్త.[1] 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సామాజిక సేవ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2]

సరోజ్ బజాజ్
జననం1945
జాతీయతభారతీయురాలు
వృత్తిసామాజిక కార్యకర్త
వెబ్‌సైటుసరోజ్ బజాజ్ వెబ్సైటు

జీవిత విశేషాలు మార్చు

సరోజ్ బజాజ్ 1945లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించింది. 15 ఏళ్ళ వయసులోనే పెళ్ళి జరిగింది.[3] ఉన్నత విద్య కోసం హైదరాబాదుకు వచ్చిన సరోజ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో హిందీ ఆచార్యురాలుగా పనిచేసి, సమాజిక సేవ చేయడంకోసం 1998లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంది.

సామాజికరంగం మార్చు

మహిళలకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు అందింవ్వడంకోసం మహిళా దక్ష సమితిని స్థాపించి, అనేకమంది మహిళలకు అండగా నిలలిచింది. మహిళలకు ఆర్థిక సహాయం అందించడంకోసం తానే చైర్‌పర్సన్ గా ది ఏపీ రాజరాజేశ్వరి మహిళా కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌'ను స్థాపించింది. అనాథ బాలికల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హాస్టల్స్‌, పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ, నర్సింగ్‌ కళశాలలు ఏర్పాటుచేసింది.[4]

పురస్కారాలు మార్చు

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[5]

మూలాలు మార్చు

  1. The Hans India, Featured>Womenia (17 August 2018). "Helping women and girl child: Dr Saroj Bajaj". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2018. Retrieved 7 April 2020.
  2. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 7 April 2020.
  3. Telangana Today, SundayScape » Telangana Diaries (30 September 2018). "On a mission to educate". Telangana Today. Meenakshi Sengupta. Archived from the original on 8 April 2020. Retrieved 8 April 2020.
  4. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 March 2020. Retrieved 7 April 2020.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 March 2020. Retrieved 20 March 2020.

ఇతర లంకెలు మార్చు