సింహం నవ్వింది రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నందమూరి హరికృష్ణ నిర్మించిన 1983 నాటి కామెడీ చిత్రం. డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, నందమూరి బాలకృష్ణ, కళా రంజని ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1][2] శివాజీ గణేశన్, కార్తీక్ నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రాజా మరియాధాయ్గా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ కెరీర్ లొనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది..

సింహం నవ్వింది
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
శ్రీదేవి,
నందమూరి బాలకృష్ణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్
విడుదల తేదీ జులై 3, 1983
భాష తెలుగు

కథ మార్చు

నరసింహం (ఎన్‌టి రామారావు) పెద్ద పారిశ్రామికవేత్త. వివాహం పట్ల ద్వేషాన్ని పెంచుకున్న దీర్ఘకాలిక బ్రహ్మచారి. అతను కార్యాలయంలో నియంతలా ప్రవర్తిస్తాడు. అతని మాట అందరికీ శాసనం. బాలకృష్ణ (నందమూరి బాలకృష్ణ) అతని అసిస్టెంట్ మేనేజరు. అతను కష్టపడి పనిచేసేవాడు. అతను కూడా బ్రహ్మచారి అయినందున బాసు నుండి అందరికంటే ఎక్కువ ప్రశంసలు అందుకుంటూంటాడు. బాలకృష్ణ ఒక అందమైన అమ్మాయి రాధ (కళా రంజని) ను ప్రేమిస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేవరకు తమ పెళ్ళిని వాయిదా వేస్తాడు. రాధ తండ్రి పర్వతాలు (అల్లు రామలింగయ్య) ఒత్తిడి కారణంగా, అతను రాధను ఒక ఆలయంలో రహస్యంగా పెళ్ళి చేసుకుంటాడు. అతడికి పదోన్నతి వచ్చేవరకు వాళ్ళు కలవటానికి పర్వతాలు ఒప్పుకోడు. కాబట్టి, బాలకృష్ణ ఒక ప్రణాళిక వేసి, రాధను తీర్థయాత్ర పేరిట హనీమూన్‌కు తీసుకువెళతాడు. ఆఫీసులో, తన అమ్మమ్మ చనిపోయిందని అబద్ధం చెప్పి సెలవు తీసుకుంటాడు. వారి ప్రయాణంలో, అనుకోకుండా, వారి వాహనం చెడిపోతుంది. ఆ రాత్రి తమకు తెలియకుండానే వారు తమ కార్యాలయ అతిథి గృహంలో ఉంటారు. మరుసటి రోజు, నరసింహం ఆఫీసు పనిపై అదే గెస్ట్ హౌసుకు వస్తాడు. అతను రాధను గెస్ట్ హౌస్ లో ఒంటరిగా చూస్తాడు. అతను ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆమె ఇంటర్వ్యూ కోసం వచ్చానని ఆ రాత్రి అక్కడే ఉండాలని ఆమె అబద్ధం చెబుతుంది. కానీ నరసింహం దానిని నమ్మడు. ఇంటి నుండి తన ప్రియుడితో పారిపోయి వచ్చిందని అనుకుంటాడు. గెస్ట్ హౌస్ వాచ్ మాన్ లింగయ్య (నూతన్ ప్రసాద్), అతని భార్య కనకమ్మ (మమత) సహాయంతో బాలకృష్ణ వారి క్వార్టర్స్‌లో దాక్కుని ఏదో ఒకవిధంగా గండం నుండి బయట పడతాడు.

నరసింహం రాధకు ఉద్యోగం ఇచ్చి ఆమెను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమిస్తాడు. ఆ తరువాత, రాధను నరసింహం నుండి విడిపించడానికి బాలకృష్ణ వివిధ ప్రణాళికలు వేసినా విఫలమవుతాడు. ఇది చూసిన రాధ అతడేదో ఒక చెడ్డ ఉద్దేశంతీ ఇలా చేస్తున్నాడని నరసింహాన్ని నిందిస్తుంది. నరసింహం రాధను చెంపదెబ్బ కొట్టి తన గతాన్ని వెల్లడిస్తాడు. అతని మేనకోడలు ప్రేమ పేరిట ఒక రోగ్ చేతిలో చిక్కుకొని మోసపోతుంది. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అందుకే అతడు రాధ పట్ల అభిమానం కలిగి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూంటాడు. రాధ కూడా అతనికి మానసికంగా దగ్గరవుతుంది. ఆమె బాలకృష్ణతో నిజం వెల్లడించడం మంచిదని, నరసింహం అర్థం చేసుకుంటాడనీ చెబుతుంది. నరసింహం అబద్ధాలు చెప్పే వ్యక్తులను ద్వేషిస్తాడని రాధకు తెలియగానే ఆమె భయపడుతుంది. కాబట్టి, ఇద్దరూ ఆ ప్రదేశం నుండి తప్పించుకుంటారు, నరసింహం పోలీసులకు ఫిర్యాదు ఇస్తాడు. రాధను కనుగొన్న వ్యక్తులకు బహుమతి కూడా ప్రకటిస్తాడు. పోలీసులు, జనరల్ పబ్లిక్ వారి వెనుక పడతారు. చివరికి వారిని పోలీసులు పట్టుకుని నరసింహమ్ ముందు హాజరుపరుస్తారు. బాలకృష్ణ తన తప్పును అంగీకరించి, తన ఉద్యోగానికి రాజీనామా చేసి, క్షమాపణ కోరతాడు. నరసింహమ్ రాజీనామాను తిరస్కరించి, అతనికి ప్రమోషన్ ఇస్తాడు. పెద్దగా నవ్వుతాడు.

నటీనటులు మార్చు

  • ఎన్.టి.రామారావు
  • బాలకృష్ణ
  • కళారంజని
  • నూతన్ ప్రసాద్
  • అల్లు రామలింగయ్య
  • త్యాగరాజు
  • రాళ్ళపల్లి
  • కె.కె.శర్మ
  • మమత

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఎస్. పాట సాహిత్యం గాయనీ గాయకులు నిడివి
1 "గువ్వా గువ్వా ఎక్కడికే" సి.నారాయణ రెడ్డి నందమూరి రాజా, ఎస్.జానకి 3:40
2 "హే భమ్ చుకు భం" సి.నారాయణ రెడ్డి నందమూరి రాజా, పి.సుశీల 3:49
3 "జాబిలి వచ్చింది" సి.నారాయణ రెడ్డి నందమూరి రాజా, ఎస్.జానకి 4:05
4 "ముంజలాంటి చిన్నదాన" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:00
5 "ఓక్కసారి నవ్వు" సి.నారాయణ రెడ్డి నందమూరి రాజా, ఎస్.జానకి 3:54
6 "ఎలా ఎలా నీకుంది" సి.నారాయణ రెడ్డి నందమూరి రాజా, ఎస్.జానకి 4:00

మూలాలు మార్చు

  1. "Heading". The Cine Bay. Archived from the original on 2015-02-12. Retrieved 2020-08-18.
  2. "Heading-2". Apna India. Archived from the original on 2016-03-03. Retrieved 2020-08-18.

బయటి లింకులు మార్చు