సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ (ఎన్‌జడ్‌ఎం), సికింద్రాబాద్ (ఎస్‌సీ) స్టేషనులకు అనుసంధానించే భారతీయ రైల్వేలు వ్యవస్థలోని ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది న్యూ ఢిల్లీ, సికింద్రాబాద్ మధ్య 22 గంటల ప్రయాణ సమయంతో అతివేగంగా ప్రయాణించే రైలు. ఇది ప్రస్తుతం 12285/12286 రైలుబండి సంఖ్యలుతో నిర్వహించబడుతున్నది.[2]
సారాంశం | |
---|---|
రైలు వర్గం | దురంతో ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 14 మార్చి 2010 |
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు (దక్షిణ మధ్య రైల్వే జోన్) |
మార్గం | |
మొదలు | సికింద్రాబాద్ జంక్షన్ |
ఆగే స్టేషనులు | 2 |
గమ్యం | ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ |
ప్రయాణ దూరం | 1,660 km (1,030 mi) |
సగటు ప్రయాణ సమయం | 12285 - 21 గం. 5 ని.లు, 12286 - 22 గం. 10 ని.లు |
రైలు నడిచే విధం | వారానికి రెండు రోజులు |
రైలు సంఖ్య(లు) | 12285 అప్, 12286 డౌన్ |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి 1,2,3, స్లీపర్ |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | ఉంది |
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 1 |
పట్టాల గేజ్ | బ్రాడ్- 1,676 mm (5 ft 6 in) |
వేగం | 76.76 km/h (47.70 mph) (సరాసరి) |
దురంతో రైళ్లు మార్చు
ఇండియన్ రైల్వే 2009-10 సం. బడ్జెట్లో భారతదేశం కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ దురంతో రైళ్లు అని ఒక కొత్త రకం రైలు యొక్క సేవలను ప్రవేశపెట్టారు.[3] ఇవి కేవలం సాంకేతిక కారాణాలతో మాత్రమే ఆగుతాయి, వీటిని సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వరకు ఒక కాని స్టాప్ రైళ్ళుగా నడపవచ్చును.
దురంతో రైళ్లు ప్రధాన పట్టణాల మధ్య నడుస్తాయి. వీటిని ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2009-10 (3 జూలై, 2009 ప్రవేశ పెట్టారు), 12 వీక్లీ, బై-వీక్లీ, ట్రై-వీక్లీదురంతో రైళ్లను[4] ప్రకటించారు. ఆ తరువాతి రైల్వే బడ్జెట్ (24 ఫిబ్రవరి, 2010) సం.లో మరొక పది వీక్లీదురంతో రైళ్ళను చేర్చారు.[5]
సేవ (సర్వీస్) మార్చు
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ వరకు మధ్యలో మొత్తం 3 విరామములతో చేరుకుంటుంది. ఇది 77 కిలోమీటర్ల సరాసరి వేగంతో 21 గంటల 25 నిమిషాల్లో ప్రయాణించి 1659 కి.మీ. దూరం యొక్క తన గమ్యాన్ని పూర్తిచేస్తుంది.[2]
మధ్యంతర స్టేషన్లు మార్చు
సికింద్రాబాద్ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ మధ్య 225 ఇంటర్మీడియట్ స్టేషన్లు ఉన్నాయి.
తరచుదనం మార్చు
ఈ రైలు వారానికి రెండు రోజులు (ఆదివారం, గురువారం) మాత్రమే నడుస్తుంది.
సరాసరి వేగం మార్చు
ఈ రైలు గంటకు 77 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.
జోను , డివిజను మార్చు
దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా మార్చు
ఈ క్రింద సూచించిన విధముగా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా ఉంది.[6]
ఇవి కూడా చూడండి మార్చు
చిత్రమాలిక మార్చు
-
జైపూర్ జంక్షన్ వద్ద జైపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్. మీరు జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రతిబింబం దాని విండోస్ లో చూడగలరు.
-
జైపూరు దగ్గర జైపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
-
నాగపూర్ - ముంబై సిఎస్టి దురంతో ఎక్స్‌ప్రెస్
-
బెంగుళూరు నుండి కోలకతాకు, యశ్వంత్‌పూర్ - హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్.
-
నిజాముద్దీన్ సికంద్రాబాద్ దురంతో
మూలాలు మార్చు
- ↑ http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=21&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-11-29.
- ↑ "Another Duranto Train Introduced". The Hindu. 10 July 2009. Archived from the original on 14 జూలై 2009. Retrieved 13 September 2009.
- ↑ "Duronto' trains for metros". Deccan Chronicle. 3 July 2009. Archived from the original on 4 సెప్టెంబరు 2009. Retrieved 22 September 2009.
- ↑ As of March 2011
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-29.