సిద్ధేంద్ర కళాక్షేత్రం

సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి గ్రామంలో నెలకొల్పబడిన నాట్యకళాశాల. దీనిని 1989లో దీనిని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేసారు.

విశేషాలు మార్చు

దీనిని బందా కనకలింగేశ్వరరావు స్థాపించాడు.[1] ఇది 1961వ సంవత్సరం వరకు తాటి పాకల్లో నడిచిన నాట్య శిక్షణలు ఇచ్చేది. తరువాత బందా కనకలింగేశ్వరరావు, అయ్యంకి తాండవ కృష్ణయ్యల వంటి వారు కళాక్షేత్రంగా నిర్మించి నాట్య కళావికాసానికి కృషి చేశారు. అనంతరం అది 1989లో నాట్య కళాశాల పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమైంది. అప్పటి నుంచి నాట్యాచార్యులుగా పనిచేసిన పలువురు కృషితో నేడు కూచిపూడి నాట్య కళాపీఠంగా రూపొందింది. దివంగత ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చింతా రామనాథం, డాక్టర్‌ వి.రామలింగశాస్త్రిలు విశేష కృషిలో భాగంగా కళాపీఠం భవనాలతో పాటు కూచిపూడి నాట్యంలో నాట్య డిప్లమో, యక్షగానం డిప్లమో, సర్టిపికెట్‌ కోర్సులు, ఎంపీఏ (మాస్టర్‌ ఆఫ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఆర్ట్స్‌), పీహెచ్‌డీ కోర్సు, కర్ణాటక సంగీతంలో కూడా సర్టిఫికెట్‌, డిప్లమో కోర్సులు అందిస్తున్నారు. దూర విద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంఏ తెలుగు, సంస్కృతం, జ్యోతిష్యం, ఎంసీజే (జర్నలిజం), సంగీత విశారద వంటి 16 రకాల కోర్సులున్నాయి. 2008లో కళాపీఠం అధ్యాపకులు, విద్యార్థులు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో భాగస్వాములుగా నిలిచారు.[2]

కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధులు మార్చు

చింతా వెంకట్రామయ్య, హరి చలపతి, హరి పున్నయ్య, వెంపటి వెంకట నారాయణ, వేదాంతం సాంబయ్య, వేదాంతం లక్ష్మీ నారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్య శాస్త్రి, వేదాంతం జగన్నాథశర్మ, భరతకళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి, వేదాంతం రాఘవయ్య, కోరాడ నరసింహరావు, వేదాంతం పార్వతీశం, పద్మభూషణ్‌‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం, పద్మశ్రీ డాక్టర్‌ వేదాంతం సత్యనారాయణశర్మ, పీవీజీ కృష్ణశర్మ, యామినీ కృష్ణమూర్తి, కొత్తపల్లి పద్మ, నృత్యచూడామణి శోభానాయుడు వంటి ప్రముఖులెందరో ఉన్నారు.

మూలాలు మార్చు

  1. Kuchipudi: A Classical Dance Forms of India!
  2. "శతాబ్ధాల చరిత్ర కృష్ణాజిల్లా సొంతం". Archived from the original on 2016-10-15. Retrieved 2016-11-13.

ఇతర లింకులు మార్చు