సిర్పూర్ పేపర్ మిల్స్

తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ లో ఉన్న ఒక ఇంటిగ్రేటెడ్ పల్ప్, పేపర్ మిల్లు

సిర్పూర్ పేపర్ మిల్స్, తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ లో ఉన్న ఒక ఇంటిగ్రేటెడ్ పల్ప్, పేపర్ మిల్లు.[1][2] 2018, ఆగస్టులో జె.కె. పేపర్ లిమిటెడ్ ఈ సిర్పూర్ పేపర్ మిల్స్‌ను కొనుగోలు చేసింది.

సిర్పూర్ పేపర్ మిల్స్

స్థాపన మార్చు

1938లో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 110 ఎకరాల స్థలంలో ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ను స్థాపించాడు.[3] 1942లో పేపర్ ఉత్పత్తి ప్రారంభించింది. దేశంలోని పురాతన పేపర్ మిల్లులలో ఒకటిగా ఈ మిల్లు నిలిచింది. 1953లో బిర్లా ఫ్యామిలీ గ్రూపుకు చెందిన పరిశ్రమలు ఈ మిల్లును స్వాధీనం చేసుకున్నాయి. తరువాత అది పొద్దార్లకు బదిలీ చేయబడింది.[4] ఇది మూసివేసే సమయంలో ఆర్కే పొద్దార్ యాజమాన్యంలో ఉంది.

పేపర్ తయారీ మార్చు

భారతదేశంలో వివిధ రకాల, వివిధ రంగు కాగితాలను తయారుచేసే కంపెనీలలో ఇదీ ఒకటి. సంవత్సారానికి 5100 టన్నుల పేపరు తయారు చేసేలా ఈ మిల్లు రూపొందించబడింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలలో వరుసగా విస్తరణలు జరగడంతో 83,550 టన్నులకు పెంచింది. సామాజిక అటవీ కార్యక్రమంలో వేగంగా పెరుగుతున్న పల్ప్‌వుడ్ మొక్కల పెంపకం కోసం వ్యవసాయ ఫారెస్ట్రీ పథకాన్ని కంపెనీ స్పాన్సర్ చేసింది. కంపెనీ 1999-2000లో సిర్పూర్ స్టేషనరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ యొక్క 100% వాటాలను పేపర్ కన్వర్షన్ యూనిట్ స్థాపించడానికి కొనుగోలు చేసింది.[5]

మూసివేత మార్చు

మిల్లును మూసివేసే సమయంలో, ఇందులో 3000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.[6] ప్లాంట్ ఆదాయాన్ని ప్రభావితం చేసే విధంగా ముడి పదార్థాల ఖర్చులు, ఇతర ఖర్చులు అధికంగా పెరుగుతున్నాయిని మిల్లు నిర్వహణ బృందం పేర్కొంది. 2014 సెప్టెంబరు 27 నుండి 2018 ఆగస్టు 2 వరకు మిల్లు మూసివేయబడింది.[7]

జెకె పేపర్ ద్వారా సేకరణ మార్చు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం మిల్లును పునఃప్రారంభించడానికి, దానిపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కృషి చేసింది.[8] హర్ష్ పాటి సింఘానియా-ప్రమోటెడ్ జెకె పేపర్ లిమిటెడ్ ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ను తీసుకుంది.

ప్రభుత్వ సహకారం మార్చు

మిల్లును టేకోవర్‌ చేసేందుకు ముందుకొచ్చిన జేకే కంపెనీకి ప్రభుత్వం పదేళ్ళపాటు పలు రకాల రాయితీలు కల్పిస్తూ జీవో 18ను జారీ చేసింది. రాష్ర్ట జీఎస్టీలో (ఎస్‌జీఎస్టీ)లో వందశాతం రియింబర్స్‌మెంట్‌, స్టాంప్‌ డ్యూటీపై వందశాతం రాయితీ, రూ.50 కోట్ల లోపు క్యాపిటల్‌ పెట్టుబడుల్లో 20 శాతం సబ్సిడీ, పేపర్‌ తయారీకి అడవులు, మార్కెట్‌ నుంచి సరఫరా చేసే సుబాబుల్‌, ఇతర ముడిసరుకును పదేళ్ళపాటు 1.5 లక్షల ఏడీఎం వరకు రాయితీ ఇచ్చింది. అవసరమైన బొగ్గును కోల్‌మైన్స్‌ నుంచి సరఫరా చేసేలా చర్యలు తీసుకొన్నది. కంపెనీ ప్రారంభించేందుకు అన్నిరకాల అనుమతులు ప్రభుత్వం కల్పించింది. డీ గ్రేడ్‌ అటవీ భూముల్లో మొక్కలు నాటుకొనేందుకు అవకాశం కల్పించింది. పదేండ్లపాటు విద్యుత్తు సరఫరాలో రాయితీలు కల్పించింది. రుణదాతలు పేపర్ మిల్లులను స్వాధీనం చేసుకున్న తరువాత జెకె పేపర్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హర్ష్ పాటి సింఘానియా, ఇతరులు పేపర్ మిల్లును తెరిచారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తదితరులు మిల్లు పునఃప్రారంభంలో సహాయపడ్డారు.[9]

పునఃప్రారంభం - ఉత్పత్తి మార్చు

2018 ఆగస్టు 2న మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. 2019 ఫిబ్రవరి 7న ఎస్పీఎంలో తిరిగి పేపర్‌ ఉత్పత్తి మొదలైంది. 2021, జూలై నాటికి ఈ పేపర్ మిల్లు సంవత్సరానికి 1.36 లక్షల టన్నుల కాగితాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.[8] 2023 ఏప్రిల్ నాటికి ఎస్పీఎంలో పేపర్‌ ఉత్పత్తి అవుతున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మంది ఉపాధి పొందుతున్నారు.

మూలాలు మార్చు

  1. "Vijayamma tastes Telangana ire - Times Of India". web.archive.org. 2013-09-01. Archived from the original on 2013-09-01. Retrieved 17 August 2021.
  2. "Directors Report | Director Details". The Economic Times. Retrieved 17 August 2021.
  3. The News Minute (9 February 2019). "Trial run at Telangana's Sirpur Paper Mills begins a year after takeover by JK Paper" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  4. Singh, S. Harpal (2014-11-02). "Sirpur Paper Mills likely to face closure". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 17 August 2021.
  5. "Sirpur Paper Mills Ltd". Business Standard India. Retrieved 17 August 2021.
  6. Singh, S. Harpal (2015-06-12). "Sirpur Paper Mill workers keep their fingers crossed". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 17 August 2021.
  7. "Revival of Telangana's 80-year-old Sirpur Paper Mill looks bleak". 2015-06-22. Archived from the original on 2021-03-03. Retrieved 17 August 2021.
  8. 8.0 8.1 Kumar, V. Rishi. "The Sirpur Paper Mills to ramp up production post ₹700 cr upgrade". @businessline (in ఇంగ్లీష్). Retrieved 17 August 2021.
  9. telugu, NT News (2023-04-19). "Sirpur Paper Mills | సిర్పూర్‌ పేపర్‌ మిల్లుకు పూర్వవైభవం.. కష్టాల కడలి దాటించిన రాష్ట్ర ప్రభుత్వం". www.ntnews.com. Archived from the original on 2023-04-19. Retrieved 2023-04-22.

బయటి లింకులు మార్చు