సుదీప్తా చక్రవర్తి

బెంగాలీ సినిమా నటి.

సుదీప్తా చక్రవర్తి, బెంగాలీ సినిమా నటి. బరివాలీ సినిమాలో నటించి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 

సుదీప్తా చక్రవర్తి
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బరివాలీ
జీవిత భాగస్వామిరాజేష్ శర్మ (2005–2009)
అవిషేక్ సాహా (2014–ప్రస్తుతం)
పిల్లలు1

జీవిత విషయాలు మార్చు

మాధ్యమిక విద్యను అలీపూర్ మల్టీపర్పస్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ నుండి పూర్తిచేసిన సుదీప్తా, ఫోర్ట్ విలియంలోని కేంద్రీయ విద్యాలయ స్కూల్ పరీక్షను పూర్తిచేసింది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆంగ్లంలో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.[1]

వ్యక్తిగత జీవితం మార్చు

సుదీప్తాకు 2005లో నటుడు రాజేష్ శర్మతో వివాహం జరిగింది. వారిద్దరు 2009లో విడాకులు తీసుకున్నారు. 2014లో అవిషేక్ సాహాని వివాహం చేసుకుంది. సుదీప్తా సోదరి బిదీప్తా చక్రవర్తి నటిగా రాణిస్తోంది.[2] సుదీప్త సంఘాత్ సినిమా ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది.

నటించినవి మార్చు

సినిమాలు

  • జ్యేష్ఠోపుత్రో (2019)
  • స్వెటర్ (2019)
  • 61 గార్పర్ లేన్ (2017)
  • ధనంజయ్ (2017)
  • షోరోరిపు (2016)
  • రాజకహిని (2015)
  • ఓపెన్ టీ బయోస్కోప్ (2014)
  • బునో హన్ష్ (2014)
  • చార్ (2014)
  • హాఫ్ సీరియస్ (2013)
  • కేరాఫ్ సర్ (2013)
  • గోయ్నార్ బక్షో (2013)
  • అబోషేషే (2012)
  • నోబెల్ చోర్ (2012)
  • ఉరోచితి (2011)
  • హిట్‌లిస్ట్ (2009)
  • సంగ్‌షోయ్ (2006)
  • కాల్‌పురుష్ (2005)
  • రోబిబార్ బైకెల్బెలా (2004)
  • మోండో మేయర్ ఉపాఖ్యాన్ (2002)
  • బరివాలీ (2000)
  • సంఘాత్
  • బగు మన్నా
  • బైకేలే భోరేర్ షోర్షే ఫూల్[3]
  • కాచర్ దేవల్
  • శృతి అలేఖ్య
  • సీ యూ

టెలివిజన్ మార్చు

  • బిగ్ బాస్ బంగ్లా (2013)
  • ఖేలా
  • బిన్ని ధనేర్ ఖోయ్
  • జోల్ నుపూర్
  • నానా రోంగర్ డింగులి

అవార్డులు మార్చు

  • బరివాలీ (2000) సినిమాకు ఉత్తమ సహాయ నటి విభాగంలో ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
  • బరివాలీ సినిమాకు ఉత్తమ సహాయ నటి విభాగంలో ఉత్తమ సహాయ నటిగా బిఎఫ్ జెఏ అవార్డు
  • 'బరివాలి' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డు (2001)
  • ఈటివి ఫిల్మ్ అవార్డు, 2001 - 'బరివాలీ' చిత్రానికి ఉత్తమ సహాయ నటి
  • కళాకర్ అవార్డ్, 2000 – బెంగాలీ ప్రైవేట్ న్యూస్ బులెటిన్ 'ఖాస్ ఖోబోర్'కి ఉత్తమ న్యూస్ క్యాస్టర్
  • కళాకర్ అవార్డ్, 2001 – 'బారివాలి' చిత్రానికి గాను ఉత్తమ వర్ధమాన నటి
  • ఆనందలోక్ అవార్డు, 2001 – మహిళా మ్యాగజైన్ షో 'శ్రీమోతి' (ఈటివి బంగ్లా)కి ఉత్తమ యాంకర్
  • ఆనందలోక్ అవార్డు, 2005 – డైలీ ఫిక్షన్ సీరియల్ 'మానసి' (ఆకాష్ బంగ్లా)కి బెస్ట్ మేక్ ఓవర్
  • ప్రతిదిన్ టెలి సమ్మాన్, 2005 – మహిళల గేమ్ షో 'ధన్ని మేయే' (జీ బంగ్లా)కి ఉత్తమ యాంకర్
  • ప్రతిదిన్ టెలి సమ్మాన్, 2006 – రోజువారీ ఫిక్షన్ సీరియల్ మానసి (ఆకాష్ బంగ్లా) కోసం ప్రతికూల పాత్రలో ఉత్తమ ప్రదర్శన
  • జీ గౌరవ్ అవార్డు, 2007 – డైలీ ఫిక్షన్ సీరియల్ 'ఖేలా' (జీ బంగ్లా)కి ఉత్తమ నటి
  • జీ గౌరవ్ అవార్డు, 2012 – రంగస్థల నాటకం 'బైకేలే భోరేర్ షోర్షే ఫూల్'కి ఉత్తమ నటి

మూలాలు మార్చు

  1. "Interview". Archived from the original on 2013-08-23. Retrieved 2022-03-07.
  2. "Bidipta's not embarrassed to act out intimate scenes". The Times of India. Archived from the original on 2013-12-08. Retrieved 25 October 2012.
  3. "It's a six-year itch: Sudipta Chakraborty". The Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 24 September 2012.

బయటి లింకులు మార్చు