సురేంద్రనాథ్ (క్రికెటర్)

సురేంద్ర నాథ్ (1937 జనవరి 4 - 2012 మే 5) [1] 1958 - 1961 మధ్య పదకొండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెటరు. అతను ప్రధానంగా మీడియం-పేస్ స్వింగ్ బౌలరు. 1959లో ఇంగ్లండ్‌లో పర్యటనలో విజయవంతమయ్యాడు.

సురేంద్రనాథ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1937-01-04)1937 జనవరి 4
మీరట్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2012 మే 5(2012-05-05) (వయసు 75)
న్యూ ఢిల్లీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 88)1958 డిసెంబరు 31 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1961 జనవరి 13 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 11 88
చేసిన పరుగులు 136 1,351
బ్యాటింగు సగటు 10.46 15.70
100లు/50లు 0/0 1/4
అత్యధిక స్కోరు 27 119
వేసిన బంతులు 2,602 17,058
వికెట్లు 26 278
బౌలింగు సగటు 40.50 25.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 15
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 5/75 7/14
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 32/–
మూలం: CricInfo, 2020 ఫిబ్రవరి 1

ఆర్మీ అధికారి అయిన సురేంద్రనాథ్, 1955-56 నుండి 1968-69 వరకు విస్తరించిన కెరీర్‌లో సర్వీసెస్ జట్టులో దేశీయ క్రికెట్‌ ఆడాడు. [2] 1958-59లో సర్వీసెస్‌కు ఆడుతున్నప్పుడు, టూర్ మ్యాచ్‌లో మొదటి ముగ్గురు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేయడంతో అతను జాతీయ ప్రాముఖ్యతను పొందాడు. పాటియాలాతో జరిగిన మ్యాచ్‌లో అతను 10 పరుగులకు 6 వికెట్లు తీసి, ఆ తర్వాత మూడో టెస్టుకు ఎంపికయ్యాడు. అతను ఏకైక వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు. ఒకటి కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక భారత బౌలరతను. అతను రైల్వేస్‌పై 14 పరుగులకు 7, 62 పరుగులకు 6 వికెట్లు తీసుకుని,[3] నాల్గవ టెస్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈసారి అతను వికెట్లేమీ తీసుకోలేదు. ఐదవ టెస్టులొ తన స్థానాన్ని కోల్పోయాడు.

1959లో ఇంగ్లండ్ పర్యటనలో అతను మొత్తం ఐదు టెస్టుల్లో రమాకాంత్ దేశాయ్‌తో కలిసి బౌలింగ్ ప్రారంభించాడు. 26.62 సగటుతో 16 వికెట్లు పడగొట్టి భారత బౌలింగ్ సగటుల్లో అగ్రస్థానాన నిలబడ్డాడు. నాల్గవ టెస్ట్‌లో అతను మొదటి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 115 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. [4] ఐదవ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఏకైక ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 75 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. అలాగే భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 74 పరుగులు చేసిన స్థితిలో అతని అత్యధిక టెస్ట్ స్కోరు 27 చేసి, నరేన్ తమ్హానేతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 58 పరుగులు జోడించాడు.[5] "శారీరకంగా అంతగా బలమైన వ్యక్తి కానప్పటికీ అతను, చాలా సుదీర్ఘమైన బౌలింగు స్పెల్‌లు వేసాడు" అని విస్డెన్ పేర్కొంది. అతను "గంట సేపు లెగ్ సైడులో బౌలింగ్ చేశాడు". "ఉల్లాసంగా ఉండే ఈ క్రికెటరు లెగ్-స్టంప్ వెలుపల కాకుండా ఆఫ్-స్టంప్‌పై తన దాడిని అభివృద్ధి చేస్తే ఆటకు సహాయం చేస్తాడు" అని కూడా రాసింది. [6]

అతను 1959-60లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్టులు ఆడాడు కానీ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఆ తరువాత అతన్ని టెస్టు జట్టు నుండి తీసేసారు. 1960 డిసెంబరులో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మొదటి ఉదయం ఢిల్లీని ఆలౌట్ అవడంలో 34 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. [7] అతను 1960-61లో పాకిస్తాన్‌తో జరిగిన మూడవ, నాల్గవ టెస్టుల కోసం టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మూడవ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 46–20–93–4 గణాంకాలు సాధించాడు. అతను మరోసారి దేశాయ్‌తో కలిసి ఓపెనింగ్ అటాక్‌ చేసాడు. [8] అయితే తర్వాతి మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మళ్లీ తన స్థానాన్ని కోల్పోయాడు.

అతను తన ఏకైక ఫస్ట్-క్లాస్ సెంచరీ, 119ని 1961–62 లో సదరన్ పంజాబ్‌పై చేశాడు. అయితే మొత్తం సీజన్‌లో 15.58 సగటుతో 187 పరుగులు మాత్రమే చేశాడు. [9] 28.04 సగటుతో 22 వికెట్లు తీశాడు.[10] కానీ అతను టెస్ట్ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఆ తర్వాత అతను సక్రమంగా ఆడలేదు, అయితే 1967-68లో ఐదు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో అతను 13.44 సగటుతో 25 వికెట్లు పడగొట్టాడు.[11] అది, సర్వీసెస్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో సహాయపడింది. ఆఖరి జోనల్ మ్యాచ్‌లో, రైల్వేస్‌ను అధిగమించి ఫైనల్స్‌కు చేరుకోవడానికి సర్వీసెస్‌కి కనీసం మొదటి-ఇన్నింగ్స్ విజయం అవసరమైనప్పుడు, అతను 59 పరుగులకు 7 వికెట్లు తీసి, సర్వీసెస్ చేసిన 207 కి ప్రత్యుత్తరంగా రైల్వేస్‌ను 114 పరుగులకు అవుట్ చేశాడు [12]

మూలాలు మార్చు

  1. "Surendra Nath". ESPN Cricinfo. Retrieved 22 May 2021.
  2. Wisden 2013, p. 241.
  3. Railways v Services 1958–59
  4. England v India, Manchester 1959
  5. England v India, The Oval 1959
  6. Wisden 1960, p. 265.
  7. Delhi v Services 1960–61
  8. India v Pakistan, Calcutta 1960–61
  9. Surendranath batting by season
  10. Surendranath bowling by season
  11. Ranji Trophy bowling averages 1967–68
  12. Services v Railways 1967–68