సులతా చౌదరి

బెంగాలీ నాటకరంగ, సినిమా నటి.

సులతా చౌదరి (1945 - 1997 సెప్టెంబరు 16) బెంగాలీ నాటకరంగ, సినిమా నటి.[1]

సులతా చౌదరి
జననం
మాయారాయ్ చౌదరి

1945
మరణం1997
జాతీయతభారతీయుడు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1960 — 1987

1960లో వచ్చిన దేబర్షి నారదర్ సన్సార్ సినిమాతో సులతా చౌదరి సినిమారంగంలోకి ప్రవేశించింది.[2] 1960లో సుధీర్ ముఖర్జీ తీసిన శేష్ పర్యంత సినిమాతో గుర్తింపు పొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[3]

జననం, విద్య మార్చు

సులతా చౌదరి 1945లో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. తండ్రి అటల్ చంద్రరాయ్ చౌదరి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, పాటలంటే ఇష్టమున్న సులతా చౌదరి, రాంనారాయణ్ మిశ్రా దగ్గర నాట్యం నేర్చుకున్నది.

సినిమారంగం మార్చు

పలు సినిమాల్లో సహాయక పాత్రల్లోనూ, ఉత్పల్ దత్ కు చెందిన లిటిల్ థియేటర్ గ్రూప్‌ నాటకాల్లోనూ నటించింది.

సినిమాలు (పాక్షికం) మార్చు

  • శేష్ పర్యంత (1960)
  • దుయ్ భాయ్ (1961) - మాధురి
  • అబాశేషే (1962)
  • కన్న (1962)
  • దాదా ఠాకూర్
  • త్రిధర (1963) - కీ సాహా
  • నాటున్ తీర్థ (1964)
  • ముఖుజే పరిబార్ (1965)
  • తీన్ భుబనేర్ పరే (1969) - బీరేశ్వర్ భార్య
  • రూపసి (1970) - బలరాం రెండవ సిల్
  • ప్రతిబాద్ (1971)
  • జనని (1971)
  • జిబాన్ జిగ్యాసా (1971)
  • స్త్రీ (1972)
  • అనిందిత (1972) - భారతి కజిన్ భార్య
  • రౌద్ర ఛాయా (1973)
  • సోనార్ ఖంచ (1973)
  • కయా హినేర్ కహినీ (1973) - కంచి
  • మౌచక్ (1974)
  • అలోర్ తికానా (1974)
  • ఫులేశ్వరి (1974)
  • సంసార్ సీమంటే (1975)
  • స్వయంసిద్ధ (1975)
  • బాగ్ బోండి ఖేలా (1975)
  • సన్యాసి రాజా (1975) - బిలాసి దాసి
  • అగ్నీశ్వర్ (1975) - పద్మ
  • సేయ్ చోఖ్ (1975)
  • దంపాటి (1976)
  • సుదుర్ నిహారిక (1976)
  • భోలా మోయిరా (1977)
  • కబిత (1977)
  • గోలాప్ బౌ (1977)
  • సబ్యసాచి (1977) - మా షుయే
  • దాదర్ కీర్తి (1980) - ఫూల్మతి
  • భాగ్య చక్ర (1980)
  • సుబర్ణ గోలక్ (1981)
  • ముఖుజ్జే పరిబార్ (1986)
  • దేబికా (1987) - (చివరి సినిమా)

మరణం మార్చు

సులతా చౌదరి 1997లో మరణించింది.

మూలాలు మార్చు

  1. "Sulata Chowdhury movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2019-05-03. Retrieved 2022-03-12.
  2. "Debarshi Narader Sansar (1960) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2022-05-16. Retrieved 2022-03-12.
  3. "Shesh Paryanta (1960) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-07-28. Retrieved 2022-03-12.

బయటి లింకులు మార్చు