సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్

సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (సంక్షిప్తంగా SRF) అనేది పరమహంస యోగానంద 1920లో స్థాపించిన ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ.[1][2][3] 1935 లో ఇది లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థగా రూపుదిద్దుకుంది.[4] ఈ సంస్థ యోగానంద బోధించిన క్రియా యోగంతో పాటు ఆయన రచనలు, బోధనల పరిరక్షణ, ప్రపంచమంతా వ్యాప్తిచేసేందుకు ఒక సాధనంగా ఉపయోగపడింది.[5] యోగానంద రాసిన భగవద్గీత పుస్తకంలో (God Talks With Arjuna: The Bhagavad Gita) క్రియా యోగం అనే సైన్సు[6] అసలైన ఆడమ్ (బైబిల్ ప్రకారం మొదటి మానవుడు) అయిన మనువుకు, ఆయన ద్వారా జనక మహారాజుకు, ఇంకా ఇతర రాజర్షులకు ఇవ్వబడింది.[7]

సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్
స్థాపన1920; 104 సంవత్సరాల క్రితం (1920)
వ్యవస్థాపకులుపరమహంస యోగానంద
రకంఆధ్యాత్మిక సంస్థ
చట్టబద్ధతలాభాపేక్ష రహిత సంస్థ
కేంద్రీకరణచదువు, వితరణ, మత పరిశోధనలు, ఆధ్యాత్మికం
ప్రధాన
కార్యాలయాలు
లాస్ ఏంజిలెస్, కాలిఫోర్నియా, అమెరికా
సేవా ప్రాంతాలుప్రపంచ వ్యాప్తం
అధ్యక్షుడుచిదానంద
అనుబంధ సంస్థలుయోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా
పరమహంస యోగానంద, స్థాపకుడు

మూలాలు మార్చు

  1. yogananda.org "About Self-Realization Fellowship".
  2. Melton, J. Gordon, Martin Baumann (2010). Religions of the World: A Comprehensive Encyclopedia of Beliefs and Practices. ABC-CLIO. ISBN 9781598842043.
  3. nytimes.com "When Being a Yogi Had an Exotic Air". Retrieved 2017-07-07.
  4. en.wikisource.org: Articles of Incorporation
  5. Bowker, John (2000). The concise Oxford dictionary of world religions / Self-Realization Fellowship. Oxford Univ. Press. p. 524. ISBN 0-19-280094-9.
  6. Which is explained in his book, Yogananda, Paramahansa (2009). "Chapter 26: The Science of Kriya Yoga". Autobiography of a Yogi. Self-Realization Fellowship. p. 272.
  7. Paramahansa Yogananda (1995). God Talks with Arjuna: The Bhagavad Gita (Chapter V), First Edition. Self-Realization Fellowship (Founded by Yogananda). ISBN 0-87612-030-3.