సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతి పొందాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి అనుమతి పొందాలి ( జీవో నెంబరు 183). అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా తమదే బాధ్యత అంటూ పూచీకత్తు ఇవ్వాలి.

సమస్యలు మార్చు

జనావాసాల మధ్య సెల్‌టవర్లతో మాత్రం ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా శారీరక రుగ్మతలకు గురవుతారని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. సెల్‌టవర్‌కు ఐదు వందల మీటర్ల దూరం వరకు దీని ప్రభావం అధికంగా ఉంటుంది. పిచుకలు, పక్షులకు కూడా ముప్పు ఏర్పడుతుంది. పటిష్ఠంగా లేని భవనాలపై టన్నుల కొద్దీ బరువుండే సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు జరగొచ్చు.