సోనాల్ మాన్ సింగ్

భారతీయ భరతనాట్యం నర్తకి

సోనాల్ మాన్ సింగ్ (జననం 1944 ఏప్రిల్ 30) ప్రముఖ భారతీయ నృత్య కళాకారిణి, గురువు. భరతనాట్యం, ఒడిస్సీ నాట్యాల్లో ఆమె ప్రావీణ్యం పొందినా, అన్ని రకాల భారతీయ సంప్రదాయ నృత్య రీతుల్లో ప్రవేశం ఉంది ఆమెకు.

Sonal Mansingh performing in New Delhi.
ఢిల్లీలోని ఓ ప్రదర్శనలో సోనాల్ మాన్ సింగ్

తొలినాళ్ళ జీవితం, నేపధ్యం మార్చు

ముంబైలో జన్మించిన సోనాల్, అరవింద్, పూర్ణిమ పక్వసాలకు రెండో సంతానంగా పుట్టింది. ఆమె తల్లి పూర్ణిమ గుజరాత్లో సామాజిక కార్యకర్త, 2004లో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. ఆమె తాత మంగళ్ దాస్ పక్వసా స్వాతంత్ర్య సమరయోధుడు. అంతేకాక స్వతంత్ర భారతదేశంలోనే మొదటి అయిదుగురు గవర్నర్లలో ఒకరు.[1]

ఆమె నాలుగవ ఏటనే నాగపూర్లో తన అక్కతో కలసి మణిపురి నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత ఏడవ ఏట నుంచీ ముంబైలోని కుమార్ జయకర్ తో సహా వేర్వేరు గురువుల వద్ద పండనల్లూర్ రీతిలో భరతనాట్యం నేర్చుకొంది సోనాల్.[2][3]

భారతీయ విద్యా భవన్ లో సంస్కృతంలో ప్రవీణ్, కోవిద డిగ్రీలు సంపాదించుకుంది సోనాల్. ముంబాయిలోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాలలో జర్మన్ సాహిత్యంలో బి.ఎ డిగ్రీ పూర్తి చేసింది ఆమె.

మూలాలు మార్చు

  1. Sonal Mansingh University of Alberta website,www.ualberta.ca.
  2. National centre for the performing Arts. Quarterly journal. v.12-13 , page 3
  3. Sonal Mansingh: The dance of life The Times of India, November 9, 2003.