శ్రీకాకుళం, విజయనగరం, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో కొన్ని మీటర్ల ఎత్తు వరకు పెరిగే సోమి చెట్టుకు 'జ్వరహారి' Antipireticగా పేరు ఉంది. దీనికి సోమిద, సోమిత, సోమిడి, రోహణ అనే పేర్లు కూడా ఉన్నాయి.

గిరిజన స్త్రీలు అనాదిగా బహిష్టు కాలంలో నొప్పి తగ్గటానికి సోమిచెక్కతో తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటారు. ఎర్రబట్ట, తెల్ల బట్ట తగ్గుతాయి అని వారి నమ్మకం.

పూర్వం దేవాలయాల్లో ప్రతిష్ఠించే ధ్వజస్తంభాలను సోమిమాను తోనే తయారు చేసేవారు. ఈ ఆచారం ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో ఉంది.

దీని శాస్త్ర నామం సోమిద ఫెబ్రిఫ్యూగ్ (జ్వరాన్ని తగ్గించే సోమిద) soymida febrifuge.

"https://te.wikipedia.org/w/index.php?title=సోమిద&oldid=3209196" నుండి వెలికితీశారు