సౌగ‌తా రాయ్‌ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1977లో జ‌రిగిన పార్లమెంట్ ఎన్నిక‌ల్లో బ‌రాక్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి చరణ్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పెట్రోలియం మ‌రియు ర‌సాయ‌నాల శాఖా మంత్రిగా పనిచేశాడు.[1]

సౌగతా రాయ్
సౌగతా రాయ్


లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2009
నియోజకవర్గం డమ్ డమ్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1946-08-06) 1946 ఆగస్టు 6 (వయసు 77)
శిల్లోంగ్, అస్సాం, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు మేఘాలయ)
జాతీయత భారతీయుడి
రాజకీయ పార్టీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ( 1998 వరకు)
జీవిత భాగస్వామి డాలీ రాయ్
నివాసం 162/D 593, లేక్ గార్డెన్స్, కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం-700 045

నిర్వహించిన పదవులు మార్చు

  • 1968 నుండి 1969 వరకు పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్ ప్రధాన కార్యదర్శి
  • 1973 నుండి 1977 వరకు పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శి
  • 1977లో బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  • 1979లో చరణ్ సింగ్ మంత్రిత్వ శాఖలో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి
  • 1987 నుండి 2009 వరకు 5 సార్లు వరుసగా బెంగాల్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2009లో డమ్ డమ్ నియోజకవర్గం నుండి 2వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  • 2009 నుండి 2012 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.
  • 2014లో డమ్ డమ్ నియోజకవర్గం నుండి 3వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  • పార్లమెంట్ లో పబ్లిక్ అండర్‌టేకింగ్‌ల కమిటీ సభ్యుడు ( 2014 ఆగస్టు 14 - 2016 ఏప్రిల్ 30)
  • పార్లమెంట్ లో రూల్స్ కమిటీ సభ్యుడు ( 2014 సెప్టెంబరు 1 – 2019 మే 25)
  • పార్లమెంట్ లో ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడు ( 2014 సెప్టెంబరు 1 – 2019 మే 25)
  • పార్లమెంట్ లో కన్సల్టేటివ్ కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ సభ్యుడు ( 2014 సెప్టెంబరు 1 – 2019 మే 25)
  • పార్లమెంట్ లో జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సభ్యుడు ( 2014 డిసెంబరు 11 – 2019 మే 25)
  • పార్లమెంట్ లో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో భద్రతపై జాయింట్ కమిటీ సభ్యుడు ( 2015 ఏప్రిల్ 29 – 2019 మే 25)
  • 2019లో డమ్ డమ్ నియోజకవర్గం నుండి 4వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  • పార్లమెంట్ లో పబ్లిక్ అండర్‌టేకింగ్‌ల కమిటీ సభ్యుడు (24 జూలై 2019 - ప్రస్తుతం)
  • పార్లమెంట్ లో ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడు ( 2019 సెప్టెంబరు 13 – ప్రస్తుతం)
  • పార్లమెంట్ లో కన్సల్టేటివ్ కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ సభ్యుడు ( 2019 సెప్టెంబరు 13 – ప్రస్తుతం)

మూలాలు మార్చు

  1. Lok Sabha (2021). "Saugata Roy". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.