స్వరాజ్ అభియాన్

భారతీయ రాజకీయ పార్టీ

స్వరాజ్ అభియాన్ అనేది భారతీయ రాజకీయ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బహిష్కరణకు గురైన తరువాత యోగేంద్ర యాదవ్, అవినీతి వ్యతిరేక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ 2015, ఏప్రిల్ 14న గుర్గావ్‌లో దీనిని ఏర్పాటుచేశారు. ఈ సంస్థ భావజాలాన్ని వాస్తవికతగా మారుస్తుందని, జీవితంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అన్ని అంశాలలో స్వరాజ్యాన్ని సాధించాలని పేర్కొంది. 2016, జూలై 31న స్వరాజ్ అభియాన్, స్వరాజ్ ఇండియా అనే రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది.[2] తదనంతరం, 2016 అక్టోబరు 2న, స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో రాజకీయ పార్టీ - స్వరాజ్ ఇండియా ప్రకటించబడింది.[3]

స్వరాజ్ అభియాన్
స్థాపకులుయోగేంద్ర యాదవ్
ప్రశాంత్ భూషణ్
స్థాపన తేదీ31 జూలై 2016 (7 సంవత్సరాల క్రితం) (2016-07-31)
ప్రధాన కార్యాలయంఎ – 189, సెక్టార్ 43, నోయిడా, ఉత్తర ప్రదేశ్ 201301
ఈసిఐ హోదారిజిస్టర్ చేయబడిన గుర్తింపు లేని పార్టీ[1]
లోక్‌సభలో సీట్లు0/545
శాసనసభలో స్థానాలు0/90
Website
www.swarajindia.org

నేపథ్యం మార్చు

2014 చివరలో, రాబోయే 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పార్టీ వ్యవస్థాపక సూత్రాలకు అనుగుణంగా లేదని ప్రశాంత్ భూషణ్ ఆరోపించాడు.[4] ఇది ఆరోపణలు, ప్రత్యారోపణల పరంపరను ప్రారంభించింది, దీని ఫలితంగా యోగేంద్ర యాదవ్, భూషణ్‌లను 2015లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తొలగించారు.[5][6]

ఈ పరిణామాలు పరిస్థితి, భవిష్యత్తు దిశను చర్చించడానికి 2015 ఏప్రిల్ 14న యాదవ్, భూషణ్ మద్దతుదారులచే బహిరంగ సంభాషణ - స్వరాజ్ సంవాద్-కి దారితీశాయి.[7][8][9] దాని ఫలితమే స్వరాజ్ అభియాన్ ఏర్పాటు.

భూషణ్ స్వరాజ్ అభియాన్ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.[10]

జై కిసాన్ ఆందోళన్ మార్చు

స్వరాజ్ అభియాన్ భారతదేశంలో రైతుల హక్కులను దృష్టిలో ఉంచుకుని జై కిసాన్ ఆందోళన్ అనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది.[11] వ్యవసాయానికి సంబంధించిన పబ్లిక్ పాలసీలలో ఆరోపించిన లోపాల కారణంగా రైతుల దుస్థితిని హైలైట్ చేయడం దీని లక్ష్యం. 2015లో, భూసేకరణ చట్టంలో సవరణలు, రైతు నష్టపరిహారం, పంటలకు కనీస మద్దతు ధరను హేతుబద్ధీకరించడం, రైతులకు వేతన కమీషన్ కోసం డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చిన్న రైతు సంఘాల మధ్య సమన్వయం చేసింది.[12][13] యోగేంద్ర యాదవ్ జై కిసాన్ ఆందోళన్ జాతీయ కన్వీనర్ గా ఉన్నాడు.[14]

2015 డిసెంబరులో, ప్రశాంత్ భూషణ్ స్వరాజ్ అభియాన్ తరపున భారత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా నిర్దేశించిన ప్రకారం కరువు పీడిత రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధాన్యాలు, పప్పులు, పంచదార సక్రమంగా సరఫరా అయ్యేలా న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.[10]

మూలాలు మార్చు

  1. "List of Political Parties and Symbols (Notification)" (PDF). Election Commission of India. 18 January 2013.
  2. Yadav, Yogendra. "Interview: Yogendra Yadav on How the Swaraj Abhiyan's Political Party Plans to Be Different". theWire.
  3. "Yogendra Yadav, Prashant Bhushan's Swaraj India to contest 50 wards in BMC polls". The Indian Express. 5 October 2016. Retrieved 2018-05-26.
  4. "AAP: Explosive letters leaked. Retrieved 21 April 2015".
  5. "AAP reconciliation talks fail; Yadav, Bhushan accuse Kejriwal of forcing them to quit". First Post.
  6. "Prashant Bhushan, Yogendra Yadav out of key AAP panel". Indian Express.
  7. "AAP rebels hold Swaraj Samvad in Gurgaon: 10 big developments". India Today.
  8. "'Swaraj Samwad' on April 14 an Attempt to Break AAP: Yogendra Yadav". NDTV.
  9. "Swaraj Samvad a Political movement: AAP rebels Bhushan, Yadav unsure of forming new Political party". First Post.
  10. 10.0 10.1 Vishwanath, Apurva (17 December 2015). "SC directs government to expedite drought relief to affected farmers". Livemint. Retrieved 2018-05-26.
  11. "Swaraj Abhiyan enters politics via farmers". The Times of India.
  12. "Yogendra Yadav to lead 10-day 'tractor' march to Delhi". Indian Express.
  13. "Yogendra Yadav to interact with farmers on July 4". The Times of India.
  14. "avik saha is the national convenor of Jai Kisan Andolan of Swaraj Abhiyan yogendra yadav is the national president of Swaraj India-The Hindu BusinessLine". BusinessLine (in ఇంగ్లీష్). Retrieved 2024-02-11.

బాహ్య లింకులు మార్చు