హరిభట్టు

తెలుగు కవి

ఖమ్మం జిల్లా సాహితీ రంగంలో హరిభట్టు ముందువరుసలో వుంటారు. ఈయన ఖమ్మంజిల్లా ఆదికవిగా పేరుగాంచారు. హరిభట్టు పూర్తిపేరు ‘హరిహరభట్టు’ తండ్రి పేరు రాఘవరామచంద్ర చట్టోపాద్యాయులు, ఛటోపాద్యాయ అనేది ఇంటిపేరు కాదు. వీరి తండ్రిగారిని కొందరు రాఘవయ్య అనికూడా పిలిచే వారు. తల్లి తిమ్మమ్మ (తిమ్మమాంబ) ఈయన భారద్వాజ గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు.

కాల నిర్ణయం మార్చు

ఇతని కాలం సా.శ. 1475 - 1535 మధ్యకాలం నాటివాడని ఆంధ్రకవి తరంగిణిని రచించిన చాగంటి శేషయ్యగారు నిర్ణయనిర్ధారణ చేసారు.

రచనలు మార్చు

ఈయన మత్స్య పురాణము, వరాహ పురాణము, నారసింహ పురాణము మొదలైన పురాణాలను ఆంధ్రీకరించడమే కాక స్వయంగా సంస్కృత భాషలో కూడా గ్రంథాలను రచించారు. హరిభట్టు తన ‘వరాహ పురాణం’రచనను (1510) కంబంమెట్టు (ఖమ్మం) కరణం కొలిపాక ఎఱ్ఱయకు అంకితం ఇచ్చారట.మత్స్యపురాణాన్ని సా.శ. 1525 ప్రాంతమున ఆంధ్రీకరించి దానిని శ్రీరంగనాధునికి అంకితము చేసారు. పోతన భాగవతములో కొన్ని భాగములు లుప్తము కాగా, ఏకాదశ ద్వాదశ స్కంధాలను 1500 సంవత్సరము ప్రాంతములోనూ, షష్ఠ్యస్కందమును 1520 ప్రాంతములోనూ పూరించారు. భాగవతములోని నిషష్ఠ ఏకాదశ, ద్వాదశ స్కంధములు, నారసింహపురాణము ఉత్తరభాగము, శృంగారదీపిక అను గ్రంథాలను కూడా రచించారు.

రచనా విధానం మార్చు

బమ్మెర పోతన, మాదయగారి మల్లన పద్యనడకలను అనుసరించి హరిభట్టు ఖమ్మమును శ్రీహరిలీలా విలాసమునకే ఆటపట్టుగా చేసారు.

సమకాలికులు మార్చు

చరిగొండ ధర్మన్న వీరికి సమకాలికులని చెపుతారు.


మూలాలు మార్చు

బయటిలంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=హరిభట్టు&oldid=3499606" నుండి వెలికితీశారు