హుస్నాబాద్ మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

హుస్నాబాద్ మండలం,తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. హుస్నాబాద్, ఈ మండలానికి కేంద్రం.

హుస్నాబాద్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°07′53″N 79°12′22″E / 18.131331°N 79.206018°E / 18.131331; 79.206018
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం హుస్నాబాద్
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 118 km² (45.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 42,696
 - పురుషులు 21,441
 - స్త్రీలు 21,255
పిన్‌కోడ్ 505467

గణాంక వివరాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త కరీంనగర్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల మండల జనాభా ప్రకారం- మొత్తం 78,793 - పురుషులు 39,593 - స్త్రీలు 39,200. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 118 చ.కి.మీ. కాగా, జనాభా 42,696. జనాభాలో పురుషులు 21,441 కాగా, స్త్రీల సంఖ్య 21,255. మండలంలో 10,886 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి సిద్ధిపేట జిల్లాకు మార్పు. మార్చు

లోగడ హుస్నాబాద్ గ్రామం / మండలం కరీంనగర్ జిల్లా,కరీంనగర్ రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా హుస్నాబాద్ మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా,కొత్తగా ఏర్పడిన హుస్నాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. హుస్నాబాద్
  2. పొట్లపల్లి
  3. మడుద
  4. మొహమ్మదాపూర్
  5. నాగారం
  6. ఉమ్మాపూర్
  7. మీర్జాపూర్
  8. పోతారం (యస్)
  9. తోటపల్లి (యస్)
  10. కూచన్‌పల్లి
  11. పందిళ్ళ

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-04-11.
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు మార్చు