హెనైకోసేన్ (heneicosane) అనేది 21 కార్బనులు వున్న సరళ శృంఖల సౌష్టవం కలిగి వున్న ఆల్కేన్.ఇది పెరిప్లోకా లేవిగాటా ఇంకా కార్తామస్ టింక్టోరియస్ వంటి మొక్కల లో వున్నది.ఇది ఫెరోమోన్/ఫేర్మోన్(ఒక జంతువు, ముఖ్యంగా క్షీరదం లేదా కీటకం ద్వారా ఉత్పత్తి చేయబడి పర్యావరణంలోకి విడుదల చేయబడిన రసాయనం, దాని జాతులలోని ఇతరుల ప్రవర్తన లేదా శరీరధర్మ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది)గాను, మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె (volatile oil) భాగం వలె పాత్రను కలిగి ఉంటుంది.[1][2]హెనైకోసేన్ అనేది వనిల్లా మడగాస్కారియెన్సిస్, మాగ్నోలియా అఫిసినాలిస్అలాగే ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.

హెనైకోసేన్
Structural formula of heneicosane
పేర్లు
Preferred IUPAC name
Henicosane
ఇతర పేర్లు
n-Heneicosane
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [629-94-7]
పబ్ కెమ్ 12403
యూరోపియన్ కమిషన్ సంఖ్య 211-118-9
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32931
SMILES CCCCCCCCCCCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1748500
ధర్మములు
C21H44
మోలార్ ద్రవ్యరాశి 296.58 g·mol−1
స్వరూపం Waxy solid
సాంద్రత 0.7919 g mL−1
ద్రవీభవన స్థానం 40.5 °C (104.9 °F; 313.6 K)
బాష్పీభవన స్థానం 356.10 °C; 672.98 °F; 629.25 K
2.9×10−11 g/L
log P 10.65
బాష్ప పీడనం 8.73X10-5 mm Hg
kH 120 atm•m3/mole
వక్రీభవన గుణకం (nD) 1.4441
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

లభ్యత వనరులు మార్చు

బ్లాక్ ఎల్డర్‌బెర్రీస్, కామన్ ఒరేగానో మరియు లెమన్ బామ్స్ వంటి కొన్ని విభిన్న ఆహారాలలో సగటున హెనైకోసేన్ అత్యధిక సాంద్రతలో కనుగొనబడినది.పొద్దుతిరుగుడు పువ్వులు, కోహ్ల్రాబిస్, నారింజ బెల్ పెప్పర్స్, లిండెన్‌లు మరియు మిరియాలు (సి. యాన్యుమ్) వంటి అనేక విభిన్న ఆహారాలలో కూడా హెనికోసేన్ తక్కువ పరిమాణంలో కనుగొనబడింది.[3]

అణు నిర్మాణం/సౌష్టవం మార్చు

హెనైకోసేన్ అణువు మొత్తం 65 పరమాణువు(లు)ను కలిగి ఉంటుంది. 44 హైడ్రోజన్ అణువు(లు) మరియు 21 కార్బన్ అణువు(లు) ఉన్నాయి.[4]

భౌతికగుణాలు మార్చు

హెనైకోసేన్ ఘన రూపంలో వుండే స్పటిక రూప ఆల్కేన్.[5]తెల్లని స్పటిక రూపంలొ వుండే మైనం పదార్థం.అలాగే వాసన లేని పదార్థం కూడా.పొడవైన హైడ్రోకార్బన్ గొలుసు వున్న ఆల్కేన్.

లక్షణం/గుణం మితి/విలువ
అణు రసాయన సూత్రం C21H44
అణు భారం 296.6 గ్రా/మోల్[6]
ద్రవీభవన ఉష్ణోగ్రత 40.4°C[7]
మరుగు స్థానం 359°C[7]
ఫ్లాష్ పాయింట్ 113°C[7]
సాంద్రత 0.7917,20°Cవద్ద[5]
వక్రీభవన గుణకం 1.4441,20°Cవద్దC/D[7]
బాష్పీభవన గుప్తోష్ణం 93.7 కి.జౌల్స్/మోల్[8]

ఉపయోగాలు మార్చు

  • హెనైకోసేన్ ఒక ఫెరోమోన్ మరియు అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.[9]

దుష్పలితాలు మార్చు

ఆరోగ్య సమస్యలు మార్చు

  • హెనైకోసేన్ ప్రభావం వల్ల కళ్ళు మంటగా అనిపించవచ్చు.చర్మం దురద పెట్టవచ్చు.ప్రాధమిక చికిత్స తరువాత వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాలి.[10]

ఇవి కూడా చదవండి మార్చు

ఆల్కేన్

మూలాలు మార్చు

  1. "Heneicosane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-30.
  2. "henicosane". ebi.ac.uk. Retrieved 2024-04-30.
  3. "Heneicosane". hmdb.ca. Retrieved 2024-04-30.
  4. "Formula of HENEICOSANE". molinstincts.com. Retrieved 2024-04-30.
  5. 5.0 5.1 "N-HENEICOSANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-30.
  6. "Heneicosane". chemspider.com. Retrieved 2024-04-30.
  7. 7.0 7.1 7.2 7.3 "n-Heneicosane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-30.
  8. "Heneicosane". webbook.nist.gov. Retrieved 2024-04-30.
  9. "Heneicosane". medchemexpress.com. Retrieved 2024-04-30.
  10. Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 72