హేమెన్ గుప్తా

జార్ఖండ్ కు చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత

హేమెన్ గుప్తా జార్ఖండ్ కు చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.[1][2] హిందీ సినిమాలు, బెంగాలీ సినిమాలలో పనిచేశాడు.

హేమెన్ గుప్తా
జననం
హేమెన్ గుప్తా

1914, మార్చి 21
రాజ్‌మహల్‌, జార్ఖండ్
మరణం1967, మే
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1930–1967
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆనంద్ మఠ్ (1952), ఫెర్రి (1953), కాబూలీవాలా (1961)
జీవిత భాగస్వామిరత్న గుప్తా
పిల్లలుజయంత గుప్తా (కుమారుడు)
జయశ్రీ గుప్తా మోత్వానే (కుమార్తె)

జీవిత విషయాలు మార్చు

హేమెన్ గుప్తా 1914, మార్చి 21న జార్హాండ్‌లోని రాజ్‌మహల్‌లో జన్మించాడు. తండ్రి పూర్ణానంద్ గుప్తా స్టేట్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేశాడు. తండ్రి బంగ్లాదేశ్‌లోని ఢాకాకి బదిలీ చేయబడడంతో అక్కడ హేమెన్ తన చిన్నతనంలో గడిపాడు.

ఢాకాలో ఉన్నత పాఠశాల, అండర్గ్రాడ్ కళాశాలలో చదువులను పూర్తి చేసాడు. అక్కడ అకడమిక్ గౌరవాలతో పట్టభద్రుడయ్యాడు. అండర్గ్రాడ్ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)కి మారాడు.

కలకత్తాలో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందేందుకు జాతీయ విప్లవ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1928లో స్థానిక కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరాడు, బ్రిటిష్ అధికారులు విధ్వంసకర కార్యకలాపాలుగా భావించిన దానిలోకి ఆకర్షితుడయ్యాడు.

1931లో బ్రిటీష్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు, రెండు ఆరోపణలపై దోషిగా నిర్ధారించారు.

సినిమాలు మార్చు

దర్శకుడు మార్చు

సంవత్సరం సినిమా
1966 నేతాజీ సుభాష్ చంద్రబోస్
1961 కాబూలీవాలా
1960 బాబర్
1959 ఇన్సాఫ్ కహాన్ హై
1957 రాజ్ కమల్
1956 తక్సాల్
1954 మీనార్
1953 ఫెర్రీ (కష్టి)
1952 ఆనంద్ మఠ్
1951 బియాలీష్ (42)
1948 భూలి నై
1947 అభియాత్రి
1944 తక్రార్
1943 ద్వాంద

నిర్మాత మార్చు

సంవత్సరం సినిమా
1954 కష్టి
1952 ఆనంద్ మఠ్
1951 బియాలీష్ (42)

స్క్రీన్ ప్లే రచయిత మార్చు

సంవత్సరం సినిమా
1956 తక్సాల్
1954 (ఫెర్రీ) కష్టి
1952 ఆనంద్ మఠ్
1951 బియాలీష్ (42)

మూలాలు మార్చు

  1. "9 Bengali films that captured India". The Times of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 16 August 2020.
  2. Bengali Cinema: 'An Other Nation'. Routledge. 1 November 2010. ISBN 9781136912160. Retrieved 16 August 2020.

బయటి లింకులు మార్చు