1987 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు

భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు

1987 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం కోసం జరిగాయి, ప్రస్తుతం ఉన్న ఉప రాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి . శంకర్ దయాళ్ శర్మ , 1987 ఆగస్టు 21న ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.[1] ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసి ఉంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికలు 7 సెప్టెంబర్ 1987న జరిగేవి.

1987 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
← 1984 1987 సెప్టెంబర్ 7 1992 →
 
Nominee శంకర్ దయాళ్ శర్మ
Party భారత జాతీయ కాంగ్రెస్
Home state మధ్యప్రదేశ్

ఎన్నికలకు ముందు ఉప రాష్ట్రపతి

ఆర్. వెంకటరామన్
భారత జాతీయ కాంగ్రెస్

Elected ఉప రాష్ట్రపతి

శంకర్ దయాళ్ శర్మ
భారత జాతీయ కాంగ్రెస్

షెడ్యూల్ మార్చు

ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 1952 ఆగస్టు 4న ప్రకటించింది.

స.నెం. పోల్ ఈవెంట్ తేదీ
1. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. 1987 ఆగస్టు 18
2. నామినేషన్ పరిశీలన తేదీ. 1987 ఆగస్టు 19
3. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 1987 ఆగస్టు 21
4. పోలింగ్ తేదీ. 1987 సెప్టెంబర్ 7
5. కౌంటింగ్ తేదీ. 1987 సెప్టెంబర్ 7

ఫలితాలు మార్చు

ఎలక్టోరల్ కాలేజీలో 790 మంది లోక్‌సభ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో శంకర్ దయాళ్ శర్మ నామినేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని భావించిన రిటర్నింగ్ అధికారి పరిశీలన అనంతరం 26 మంది నామినేషన్‌లను తిరస్కరించారు. ఇప్పుడు అందరి నామినేషన్లు తిరస్కరించడం వలన శంకర్ దయాళ్ శర్మ 25 ఏప్రిల్ 1952న ఉపరాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. శంకర్ దయాళ శర్మ 1987 సెప్టెంబర్ 9న రాష్ట్రపతి కార్యాలయంలో ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]

మూలాలు మార్చు

  1. BACKGROUND MATERIAL REGARDING FOURTEENTH ELECTION TO THE OFFICE OF THE VICE-PRESIDENT, 2012, ELECTION COMMISSION OF INDIA
  2. "Background material related to Election to the office of Vice-President of India, 2017". Election Commission of India. Retrieved 26 January 2022.

వెలుపలి లంకెలు మార్చు