20వ శతాబ్ది తెలుగు వెలుగులు

2005 తెలుగు పుస్తకం

20వ శతాబ్ది తెలుగు వెలుగులు (Luminaries of 20th Century) 2005 తెలుగులో విడుదలైన పుస్తకం. దీనిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగు ప్రముఖుల జీవితచరిత్రల సంకలనం.

దీనికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం గౌరవ సంపాదకులుగాను, వెలగా వెంకటప్పయ్య, ఎం. ఎల్. నరసింహారావు సంపాదకులుగా, కో-ఆర్డినేటర్ గా వడ్లా సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఇది రెండు భాగాలుగా ముద్రించబడింది. మొదటి భాగం అ నుంచి మ వరకు; రెండవ భాగం య నుంచి హ వరకు కలిగివున్నాయి. ప్రతి భాగంలో సత్వర సంప్రదింపు కోసం విషయ సూచిక, అనుక్రమణిక కలిపిన అకారాద్యనుక్రమణికను చేర్చారు. ఇవికాగ ప్రత్యేకంగా పరిచయకర్తలు : పరిచయాలు ఒక క్రమంలో వివరించారు. ఈ గ్రంథ నిర్మాణంలో సుమారు వెయ్యిమందికి పైగా వ్యక్తులు వివిధవిభాగాలుగా పనిచేసినట్లు సంపాదకులు తెలియజేసారు.

ఈ పుస్తక గ్రంథావిష్కరణోత్సవం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి క్యాంప్ కార్యాలయంలో 2005 అక్టోబరు 22తేదీన నిర్వహించబడింది. ఉత్సవానికి ఉపాధ్యక్షులు ఆవుల మంజులత, రిజిస్ట్రారు ఎ. గురుమూర్తి అధ్యక్షత వహించింది.

పరిచయకర్తలు మార్చు

  • గుంటూరు లక్ష్మీకాంతం
  • గుడిపూడి సుబ్బారావు
  • గుమ్మడిదల వెంకట సుబ్బారావు
  • గుమ్మా శంకరరావు
  • గుర్తి వెంకటరావు
  • గొట్తిపాటి బ్రహ్మయ్య
  • చింతా వెంకటేశ్వర్లు
  • చిలకపూడి వెంకటేశ్వరశర్మ
  • చిరుమామిళ్ల రామచంద్రరావు
  • చీమకుర్తి శేషగిరిరావు
  • చేకూరి రామారావు
  • జంధ్యాల వెంకట రామశాస్త్రి
  • జటావల్లభుల పురుషోత్తం
  • కబీర్ షా మొహమ్మద్
  • జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి
  • జానమద్ది హనుమచ్ఛాస్త్రి
  • జి.వి.ఎస్.ఎల్. నరసింహరాజు
  • జి. శుభాకరరావు
  • జొన్నలగడ్డ కోణార్క్
  • జోస్యం విద్యాసాగర్
  • టి. ఉడయవర్లు
  • డి. రామలింగం
  • డి. పి. జోషి
  • తాతా రమేశ్‌బాబు
  • తిరుమల రామచంద్ర
  • తుమ్మల వెంకటేశ్వరరావు
  • తీర్థం శ్రీధరమూర్తి
  • తెన్నేటి విశ్వనాథం
  • త్రిపురనేని సుబ్బారావు
  • దామెర్ల వెంకటరావు
  • దివాకర్ల వేంకటావధాని
  • దేవాల జానకి
  • దేవినేని సీతారామయ్య
  • దొండపాటి దేవదాసు
  • ద్వారకా పార్థసారధి
  • నండూరి శ్రీరామచంద్రమూర్తి
  • నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు
  • నిడుదవోలు వెంకటరావు
  • నీలంరాజు వెంకట శేషయ్య
  • నేలటూరి వెంకట రమణయ్య
  • నేలనూతల శ్రీకృష్ణమూర్తి
  • పండితారాధ్యుల శరభారాధ్యులు
  • పరుచూరి కోటేశ్వరరావు
  • పరుచూరి శ్రీనివాసరావు

మూలాలు మార్చు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండు భాగాలు, 2005, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.