2021 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం

ఇజ్రాయెలీ-పాలస్తీనా వివాదం 10 మే 2021న ప్రారంభమైంది.మే 21న కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చే వరకు కొనసాగింది.

2021 ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం
ఇజ్రాయెల్ పోలీసు అధికారులు
తేదీ6–21 May 2021
(2 వారాలు , 1 రోజు)
స్థలంఇజ్రాయెల్ , పాలస్తీనా , ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు , గోలన్ హైట్స్
ఫలితంరెండు వైపులా విజయం సాధించారు.
LL-Q8097 (tel)-V Bhavya-2021 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం

నేపథ్య మార్చు

2021ఏప్రిల్ మధ్యలో పవిత్ర ముస్లిం నెల రంజాన్ ప్రారంభమైనప్పటి నుంచీ రాత్రి పూట పోలీసులకు, పాలస్తీనియన్లకు మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకుంది.ముస్లింల ప‌విత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభం అయింది. కోవిడ్ సంద‌ర్భంగా అల్ అక్సా మ‌సీదు వ‌ద్ద ఆంక్ష‌లు విధించారు. కేవ‌లం 10 వేల మంది మాత్ర‌మే ప్రార్థ‌న చేసుకునేందుకు ఇజ్రాయిల్ అనుమ‌తి ఇచ్చింది.అయితే ఇదే ప్రాంతంలో యూదుల‌కు చెందిన ఫ‌స్ట్‌, సెకండ్ టెంపుల్స్ ఉన్నాయి. దీన్నే టెంపుల్ మౌంట్ అని కూడా అంటారు. రంజాన్ ప్రార్థ‌న‌ల‌కు వ‌చ్చిన వేలాది మంది ముస్లింల‌ను అల్ అక్సా మ‌సీదు నుంచి త‌రిమేశారు. పాల‌స్తీనా కుటుంబాల‌ను త‌ర‌లించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల వ‌ల్ల ఈ ఉద్రిక్త‌త‌లు ఉత్ప‌న్నం అయిన‌ట్లు తెలుస్తోంది. యూద సెట్ల‌ర్ గ్రూపు ఒక‌టి కొంత భూభాగం కోసం పాల‌స్తీనా వాసుల‌తో త‌గాదాకు దిగారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. దీంతో ఆ స‌మ‌స్య ముదిరడం వ‌ల్లే రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ ప్రారంభం అయిన‌ట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ఇజ్రాయిల్ కోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఈయూ,యూఎన్‌, బ్రిట‌న్ ఖండించాయి.ఏప్రిల్ 15న యూదు వ్యక్తిని ఒక పాలస్తీనా యువకుడు చెంపదెబ్బ కొట్టిన టిక్ టాక్ వీడియో వైరల్ అయ్యింది. దీనితో మరింత యుద్ద వాతావరణం నెలకొంది.తూర్పు జెరూసలెంలో కొన్ని పాలస్తీనియన్ కుటుంబాలను తరిమికొడతామని బెదిరించడం కూడా వారికి ఆగ్రహం తెప్పించింది. ఇది కూడా ఉద్రిక్తతలు మరింత పెరగడానికి కారణమైంది.ఏప్రిల్ 23న, దక్షిణ ఇజ్రాయెల్‌పై సరిహద్దు సైనిక బృందాలు 36 రాకెట్లను ప్రయోగించిన తర్వాత, IDF గాజా స్ట్రిప్‌లోని హమాస్ లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది. తూర్పు జెరూసలేంలో వందలాది మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ పోలీసులతో ఘర్షణకు దిగడంతో రాకెట్ కాల్పులు జరిగాయి. ఏప్రిల్ 25న ఐక్యరాజ్యసమితి ప్రతినిధి టోర్ వెన్నెస్‌ల్యాండ్ హింసను ఖండించారు. జెరూసలేం అంతటా రెచ్చగొట్టే చర్యలు నిలిపివేయాలి.ఇజ్రాయెల్ వైపు విచక్షణారహితంగా రాకెట్లను ప్రయోగించడం సరి కాదని తక్షణమే నిలిపివేయాలి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 26న, గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్‌లోకి 40కి పైగా రాకెట్లు ప్రయోగించబడ్డాయి.[1] [2] [3][4][5]

గాజాలో నష్టం మార్చు

గాజా లోనే ఎత్తైన భవనాల పై 232 సార్లు బాంబు దాడులు జరిగింది.కాల్పుల విరమణ తర్వాత మే 23 UNOCHA అంచనా ప్రకారం 1,042 గృహాలు ధ్వంసమయ్యాయి.53 పాఠశాలలు దెబ్బతిన్నాయి. 6ఆసుపత్రులు,11 క్లినిక్‌లు దెబ్బతిన్నాయి. మెట్రో రైల్ భూగర్భ సొరంగం వ్యవస్థ(97 కి.మీ.) నాశనం అయింది.మే 18న ఇజ్రాయెల్ వైమానిక దాడులు గాజాలోని 100,000 పుస్తకాల స్టాక్‌ను కలిగి ఉన్న భవనాలను నేలమట్టం చేసింది.

కాల్పుల విరమణ ఒప్పందం మార్చు

ఇజ్రాయెల్, హమస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోయి శాంతి నెలకొన్నట్లేనని భావిస్తున్నారు.కాగా, ఇప్పటి వరకు జరిగిన ఘర్షణలో 232 మంది పాలస్తీనియన్లు, 12 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా గత 11 రోజులుగా గాజా ప్రజలు ప్రణాలు అరచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లో జీవించారు.ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయని అధికారిక వర్గాలు సైతం వెల్లడించినట్లు సమాచారం.

మూలాలు మార్చు

  1. "Jordan Condemns Israel for Cutting Call to Prayer at Al-Aqsa". The Media Line. 15 April 2021. Archived from the original on 18 May 2021. Retrieved 18 May 2021.
  2. Kingsley, Patrick (15 May 2021). "After Years of Quiet, Israeli-Palestinian Conflict Exploded. Why Now?". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 27 May 2021. Retrieved 25 May 2021.
  3. Boxerman, Aaron (19 April 2021). "Hundreds of Palestinians clash with police by Jerusalem's Damascus Gate". The Times of Israel. Archived from the original on 22 April 2021. Retrieved 12 May 2021.
  4. Kershner, Isabel (23 April 2021). "Israelis and Palestinians Clash Around Jerusalem's Old City". The New York Times. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  5. Ben-Shitrit, Lihi; Elad-Strenger, Julia; Hirsch-Hoefler, Sivan (8 March 2021). "'Pinkwashing' the radical-right: Gender and the mainstreaming of radical-right policies and actions". European Journal of Political Research. n/a (n/a). doi:10.1111/1475-6765.12442. S2CID 233798255. Archived from the original on 24 May 2021. Retrieved 24 May 2021.