అంకం

(అంకము నుండి దారిమార్పు చెందింది)

అంకము లేదా అంకం దశ రూపకాలలో ఒకటి. ఏదేనీ నాటకాన్ని పది రకాలుగా చేయవచ్చని సంస్కృత సాహిత్యం విభజిస్తుంది. వాటిలో ఈ అంకము తొమ్మిదవది.[1] ఈ రూపకప్రకారానికి ఉత్సృష్టికాంకము అని నామాంతరము కూడా ఉంది.[2] నాటక భాగమైన అంకంతో సార్ధక్యం కల్పించడం కోసం దీనిని కొందరు ఉత్సృష్టికాంకం అంటారు. దీనిలో ఇతివృత్తం ప్రఖ్యాతమైందిగానీ, వికృతమైందిగాని కావచ్చు. కరుణము ప్రధాన రసం. వీరాది ఇతర రసాలు కూడా ఉంటాయి. నాయకులు ప్రాకృత మనుషులు. ఇందులో స్త్రీ విషయాన్ని తరచుగా, యుద్ధ జయాపజయాదులను వాఙ్మాత్రంగా ఉపయోగించాలి. సంధి వృత్యాదులలో ఇది భాణతుల్యము. [3]

దశరూపకసారము ప్రకారం

మార్చు

దీనికి ఉత్సృష్టికాంకమని మారుపేరుంది. ఈ విధానంలో వస్తువు ముఖ్యమైనది. కవి కల్పన వలన ఇది పెరుగుతుంది. అంకములో ఒకే అంకము ఉంటుంది. నాయకులు తెలివిలేని వాళ్ళుగా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ప్రధాన రసము కరుణము, అనేక స్త్రీలు శోకిస్తారు. సంధి, వృత్తి అంగాదులు భాణములో లాగానే ఉంటాయి. జయాపజయములు, వైరాగ్య విచారాలు వస్తాయి. యుద్ధము మాటలతోనే వర్ణించబడుతుంది. ఉదాహరణ : శర్మిష్ఠాయయాతి.

మూలాలు

మార్చు
  1. రామకృష్ణ శర్మ, గడియారం. దశరూపకసారము - రూపకభేదములు. ఆంధ్ర సారస్వత పరిషత్తు. pp. 12–13. Retrieved 9 August 2016.
  2. తెలుగు సాహిత్య కోశము, ప్రాచీన సాహిత్యం. p. 1. Retrieved 9 August 2016.
  3. తెలుగు విజ్ఞాన సర్వస్వం, సంపుటం ౬, తెలుగు భాషా సమితి మద్రాసు ప్రథమ ముద్రణ (౧౯౬౧)
"https://te.wikipedia.org/w/index.php?title=అంకం&oldid=3923353" నుండి వెలికితీశారు