1947 లో దేశ విభజన తరువాత భారతదేశం, పాకిస్తాన్ల మధ్య అనేక యుద్ధాలు ఘర్షణలూ జరిగాయి. 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్య, సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణాలు. 1971 యుద్ధం ఆనాటి తూర్పు పాకిస్తాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) విముక్తి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం వల్ల జరిగింది. మొదటి కాశ్మీర్ యుద్ధం 1947 అక్టోబరులో ప్రారంభమైంది. కాశ్మీరు మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీరును భారత్‌లో కలిపేస్తాడని పాక్ భయపడింది. దేశ విభజన తర్వాత, సంస్థానాలు భారతదేశం, పాకిస్తాన్లలో ఏదో ఒకదానిలో కలవడానికి గాని, స్వతంత్రంగా ఉండడానికి గానీ స్వేచ్ఛ ఉంది. ఈ సంస్థానాలలో అతిపెద్దదైన జమ్మూ కాశ్మీరులో ముస్లింలు మెజారిటీ కాగా, పెద్ద సంఖ్యలో హిందువులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం మద్దతుతో పాక్ గిరిజన ఇస్లామిక్ దళాలు జామూకాశ్మీరు లోని కొన్ని భాగాలపై దాడి చేసి, ఆక్రమించాయి. భారత సైనిక సహాయాన్ని పొందడం కోసం, మహారాజా హరిసింగ్ జమ్మూకాశ్మీరును భారతదేశంలో విలీనం చేస్తూ సంతకం చేసాడు. ఇరుపక్షాలూ తమతమ స్థానాలను పటిష్టపరచుకున్నారు. ఈ స్థానాలను వేరుచేసే రేఖయే తదనంతర కాలంలో నియంత్రణ రేఖగా పేరుపొందింది. 1949 జనవరి 1 రాత్రి 23:59 గంటలకు అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ యుద్ధంలో భారతదేశం మూడింట రెండు వంతుల (కాశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్) పై నియంత్రణ సాధించగా, పాకిస్తాన్ సుమారు మూడవ వంతు భాగంపై నియంత్రణ సాధించింది.
(ఇంకా…)
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.