అండాశయ క్యాన్సర్

శరీరంలో అండాశయం లో ఏర్పడే క్యాన్సర్ కణితి

అండాశయ క్యాన్సర్ శరీరంలో అండాశయం లో ఏర్పడే క్యాన్సర్ కణితి.[1] ఇది అండాశయం నుండి ఏర్పడవచ్చు లేదా సాధారణంగా ఫాలోపియన్ గొట్టాలు లేదా ఉదరం లోపలి పొర వంటి సమీప భాగాల నుండి ఉద్భవించవచ్చు.[2] ఇది శరీరంలోని ఇతర భాగాలపై దాడి చేసే లేదా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అసాధారణ కణాల వలన ఏర్పడుతుంది..[3]

అండాశయ క్యాన్సర్
ఇతర పేర్లుఒవేరియన్
ఒవేరియన్ కేన్సర్ 4 వ దశ లో ఉన్న చిత్రము
ప్రత్యేకతఆంకాలజీ, గైనకాలజీ
లక్షణాలుపొత్తికడుపు వెడల్పు అవడం, కటి నొప్పి, క్రమరహిత ఋతు రక్తస్రావం, ఆకలి లేకపోవడం
సాధారణ ప్రారంభం60 నుండి 65 సంవత్సరాల మధ్య
రకాలుఅధిక-స్థాయి సెరస్ కార్సినోమా (HGSC) ,అండాశయ క్యాన్సర్లో అరుదుగా కనపడే రకాలు జెర్మ్ సెల్ కణితులు, ఇంకా సెక్స్ కార్డ్ స్ట్రోమల్ కణితులు.
ప్రమాద కారకములురుతువిరతి తర్వాత హార్మోన్ చికిత్స, సంతానోత్పత్తి మందులు, ధూమపానం, ఊబకాయం
రోగనిర్ధారణ పద్ధతికణజాల పరీక్, బయాప్సి
చికిత్సశస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ
తరుచుదనము2015 లో ఇది 1.2 మిలియన్ల మంది మహిళలు ప్రభావితమయ్యారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1,61,100 మరణాలు సంభవించాయి.[ 2000 కి 313,000 మంది కొత్త కేసులు
మరణాలు2015 లో ఇది 1.2 మిలియన్ల మంది మహిళలు ప్రభావితమయ్యారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1,61,100 మరణాలు సంభవించాయి.[

లక్షణాలు

మార్చు

ఈ వ్యాధి ఆరంభంలో, ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు లేదా స్పస్టంగా లేకపోవచ్చు.[4] క్యాన్సర్ పెరిగే కొద్దీ లక్షణాలు మరింత స్పష్ఠముగా మారుతాయి.[2] ఈ లక్షణాలలో పొత్తికడుపు వెడల్పు అవడం, కటి నొప్పి, క్రమరహిత ఋతు రక్తస్రావం, ఆకలి లేకపోవడం వంటివి ఉండవచ్చు.[3] క్యాన్సర్ సాధారణంగా ఉదరం పొర, స్థానిక గ్రంథులు, ఊపిరితిత్తులు, కాలేయం ప్రాంతాలలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి.[5]

కారణాలు

మార్చు

వారి జీవితకాలంలో అధిక అండోత్సర్గము చేసిన మహిళల్లో అండాశయ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది.[6] ఇందులో పిల్లలు లేనివారు, చిన్న వయస్సులోనే అండోత్సర్గము ప్రారంభించిన వారు, పెద్ద వయస్సులో ఋతువిరతికి చేరుకున్న వారు ఉంటారు. ఇతర ప్రమాద కారకాలు ఏమంటే ఋతువిరతి తర్వాత హార్మోన్ చికిత్స తీసుకోవడం, సంతానోత్పత్తి మందుల వాడకం, ధూమపానం చేయడం, ఊబకాయం కలిగి ఉండడం మొదలైనవి.[4] హార్మోన్ల గర్భ నియంత్రణ, గొట్టాలను ముడి వేయడం, తల్లిపాలను ఇవ్వడం వంటివి కొంతవరకు ఈ ప్రమాదాన్ని తగ్గించుతాయి.[7] స్త్రీలలో BRCA1 లేదా BRCA2 జన్యువులలో జరిగే ఉత్పరివర్తనల కారణంగా 70 సంవత్సరాల వయస్సులో కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం 40% ఉంటుంది.[8]

రకాలు

మార్చు

అండాశయ క్యాన్సర్లో అనేక రకాలు ఉన్నాయి, వీటిలో సుమారు 70% వరకు అధిక-స్థాయి సెరస్ కార్సినోమా (HGSC) ప్రభావితం చేస్తుంది.[9] అండాశయాన్ని కప్పి ఉంచే ఎపిథీలియల్ కణాల నుండి ఉద్భవిస్తుందని మొదట భావించారు, ఇప్పుడు చాలా HGSC లు ఫెలోపియన్ ట్యూబ్లో కనిపించే సెరస్ ట్యూబల్ ఇంట్రాపిథీలియల్ కార్సినోమా అని పిలువబడే గాయం (lesion) నుండి వచ్చినవి అని నిర్ధారించారు.[1] అండాశయ క్యాన్సర్లో అరుదుగా కనపడే రకాలు జెర్మ్ సెల్ కణితులు, ఇంకా సెక్స్ కార్డ్ స్ట్రోమల్ కణితులు.[7]

చికిత్స

మార్చు

అండాశయ క్యాన్సర్ నిర్ధారణ కణజాల పరీక్ష బయాప్సీ ద్వారా జరుగుతుంది, సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు .[7]

సగటు ప్రమాదం ఉన్న మహిళల్లో అనవసరమైన శస్త్రచికిత్సలు నివారించడానికి స్క్రీనింగ్ తరచుగా సిఫారసు చేయరు.[10] అయితే ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి నివారణగా వారి అండాశయాలను తొలగిస్తారు. ప్రారంభ దశలో కనుగొని చికిత్స చేస్తే అండాశయ క్యాన్సర్ తరచుగా నయం అవుతుంది.[11] చికిత్సలో సాధారణంగా శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ కీమోథెరపీ కలిపి చేస్తారు.[6] ఫలితాలు వ్యాధి ఎంత వ్యాప్తి చెందిందో, పరిధి, క్యాన్సర్ ఉపరకం వంటి ఇతర వైద్య పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.[12][13]

వ్యాధి ప్రాబల్యం

మార్చు

అమెరికాలో మొత్తం 49% మంది రోగులకు ఐదు సంవత్సరాల మనుగడ అని తెలుసు కున్నారు.[14] అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫలితాలు మరింత దారుణంగా ఉన్నాయి .[12] 2015 లో ఇది 1.2 మిలియన్ల మంది మహిళలు ప్రభావితమయ్యారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1,61,100 మరణాలు సంభవించాయి.[15] [16] 2020 నాటికి మహిళల్లో క్యాన్సర్ మరణాలకి అండాశయ క్యాన్సర్ ఎనిమిదవ కారణం, మహిళల్లో కొత్త కేసులు సుమారు 313,000 మందికి సంభవించాయి.[17] రోగ నిర్ధారణ సాధారణంగా 60 నుండి 65 సంవత్సరాల వయస్సు లో సంభవిస్తుంది.[6] ఆఫ్రికా, ఆసియాలలో కంటే ఉత్తర అమెరికా, ఐరోపాలో అండాశయ క్యాన్సర్ వలన మరణాలు ఎక్కువగా ఉన్నాయి.[1]

మందులు

మార్చు

ఇతర వివరాలు

మార్చు

ఫ్లోరోసెన్స్-గైడెడ్ సర్జరీలో పాఫోలాసియానిన్ అనే ఇమేజింగ్ ఏజెంట్ ను ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా ఇది అండాశయ క్యాన్సర్ ప్రాంతాలను కనుగొనడానికి ఉపయోగిస్తారు.

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 1.2 WHO Classification of Tumours Editorial Board, ed. (2020). "1. Tumours of the ovary: introduction". Female genital tumours: WHO Classification of Tumours. Vol. 4 (5th ed.). Lyon (France): International Agency for Research on Cancer. pp. 32–35. ISBN 978-92-832-4504-9. Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-28.
  2. 2.0 2.1 (30 July 2021). "Future Screening Prospects for Ovarian Cancer".
  3. 3.0 3.1 "Basic Information About Ovarian Cancer | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 30 March 2022. Archived from the original on 5 June 2022. Retrieved 5 July 2022.
  4. 4.0 4.1 (2022). "Ovarian Cancer".
  5. Ruddon, Raymond W. (2007). Cancer Biology (4th ed.). Oxford: Oxford University Press. p. 223. ISBN 9780195175431. Archived from the original on 2015-09-15.
  6. 6.0 6.1 6.2 Armstrong, Deborak K. (2020). "189. Gynaecologic cancers: ovarian cancer". In Goldman, Lee; Schafer, Andrew I. (eds.). Goldman-Cecil Medicine (in ఇంగ్లీష్). Vol. 1 (26th ed.). Philadelphia: Elsevier. pp. 1332–1335. ISBN 978-0-323-55087-1. Archived from the original on 2022-10-08. Retrieved 2022-10-08.
  7. 7.0 7.1 7.2 "Ovarian Cancer Prevention". NCI. 2014-06-20. Archived from the original on 6 July 2014. Retrieved 1 July 2014.
  8. "Hereditary Breast and Ovarian Cancer Syndrome: A Guide for Patients and Their Families | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 11 January 2016. Archived from the original on 9 July 2022. Retrieved 25 June 2022.
  9. WHO Classification of Tumours Editorial Board, ed. (2020). "1. Tumours of the ovary: high grade serous carcinoma of the ovary". Female genital tumours: WHO Classification of Tumours. Vol. 4 (5th ed.). Lyon (France): International Agency for Research on Cancer. pp. 45–47. ISBN 978-92-832-4504-9. Archived from the original on 2022-06-17. Retrieved 2022-06-28.
  10. Grossman DC, Curry SJ, Owens DK, Barry MJ, Davidson KW, Doubeni CA, et al. (February 2018). "Screening for Ovarian Cancer: US Preventive Services Task Force Recommendation Statement". JAMA. 319 (6): 588–594. doi:10.1001/jama.2017.21926. PMID 29450531.
  11. "Ovarian Epithelial Cancer Treatment". NCI. 2014-05-12. Archived from the original on 5 July 2014. Retrieved 1 July 2014.
  12. 12.0 12.1 World Cancer Report 2014. World Health Organization. 2014. Chapter 5.12. ISBN 978-9283204299. Archived from the original on 2016-09-19.
  13. Gibson SJ, Fleming GF, Temkin SM, Chase DM (2016). "The Application and Outcome of Standard of Care Treatment in Elderly Women with Ovarian Cancer: A Literature Review over the Last 10 Years". Frontiers in Oncology. 6: 63. doi:10.3389/fonc.2016.00063. PMC 4805611. PMID 27047797.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  14. "SEER Stat Fact Sheets: Ovary Cancer". NCI. Archived from the original on 6 July 2014. Retrieved 18 June 2014.
  15. GBD 2015 Disease and Injury Incidence and Prevalence Collaborators (October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1545–1602. doi:10.1016/S0140-6736(16)31678-6. PMC 5055577. PMID 27733282. {{cite journal}}: |author= has generic name (help)CS1 maint: numeric names: authors list (link)
  16. GBD 2015 Mortality and Causes of Death Collaborators (October 2016). "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1459–1544. doi:10.1016/S0140-6736(16)31012-1. PMC 5388903. PMID 27733281. {{cite journal}}: |author= has generic name (help)CS1 maint: numeric names: authors list (link)
  17. Woods, Penny. "Worldwide cancer data | World Cancer Research Fund International". WCRF International. Archived from the original on 15 June 2022. Retrieved 6 July 2022.