అంతం 2016లో తెలుగులో విడుదలైన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా. హను చరణ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ నిర్మించి దర్శకత్వం వహించాడు. రష్మీ గౌతమ్, చరణ్ దీప్, సుదర్శన్, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో 300 పైగా థియేట‌ర్స్ లో 2016 జూలై 07న విడుదలైంది.[1]

అంతం
దర్శకత్వంజి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
నిర్మాతజి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
తారాగణంరష్మీ గౌతమ్
చరణ్ దీప్
సుదర్శన్
వాసుదేవ్
ఛాయాగ్రహణంజి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
కూర్పుజి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
సంగీతంకార్తిక్ రోడ్రిగ్జ్
విడుదల తేదీ
07 జూలై 2016
సినిమా నిడివి
110 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

కళ్యాణ్ కృష్ణ (చరణ్ దీప్), వనిత (రష్మి) భార్యాభర్తలు. కళ్యాణ్ కృష్ణ ఓ పనిమీద విజయవాడ వెళ్తాడు, ఇంట్లో ఒంటరిగా ఉన్న వనిత తన భర్త కళ్యాణ్ కృష్ణ రాక కోసం ఎదురు చూస్తోంది, కానీ ఇంట్లో ఎవరో ఉన్నట్టు నీడ కనిపిస్తుంది, కళ్యాణ్ కృష్ణ తనకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడేమో అనుకున్న వనిత ఇంట్లో ఉన్నది భర్త కాదని తెలుసుకుంటుంది. అతను ఎవరు ?? తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: చరణ్ క్రియేషన్స్,
 • నిర్మాత:జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
 • సంగీతం: కార్తిక్ రోడ్రిగ్జ్
 • సినిమాటోగ్రఫీ: జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
 • స్టంట్స్: రామ్ సుంకర
 • సౌండ్ ఎఫెక్ట్స్: ఎతిరాజ్
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు

మూలాలు మార్చు

 1. నమస్తే తెలంగాణ, సినిమా (7 July 2016). "ఈ రోజే రేష్మి గౌత‌మ్‌ 'అంతం' విడుదల". Archived from the original on 12 August 2016. Retrieved 15 September 2016.
 2. India (8 July 2016). "Antham movie review: Rashmi Gautam starrer turns out to be a dull thriller" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
 3. Sakshi (20 June 2016). "రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.

బయటి లింకులు మార్చు