అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.[1]

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
1957–2001 మధ్యకాలంలో దక్షిణార్ధగోళంలో ఓజోన్ పోర రంధ్రం
జరుపుకొనే రోజుసెప్టెంబరు 16
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

చరిత్రసవరించు

సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత వికిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది. ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్‌ 16న సంతకాలు చేశాయి.[2] ఆ తరువాత 1994, సెప్టెంబర్‌ 16న మరో సమావేశం జరిపి, ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.[3]

లక్ష్యంసవరించు

 1. పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం.
 2. అన్ని దేశాల ప్రభుత్వాలు మాంత్రియల్‌ ప్రొటోకాల్‌ను మరింత సమర్థంగా అమలుచేసి 2050 సంవత్సరానికి ఓజోన్‌ పొరను 1980కు ముందున్నస్థాయికి తేవడం

కార్యక్రమాలుసవరించు

 1. అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయడం
 2. మొక్కలను పెంచడం
 3. యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలు రక్షణ చర్యలు చేపట్టడం[4]

ఇతర వివరాలుసవరించు

 1. 1980లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొరకు రంధ్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
 2. ప్రొటోకాల్‌పై సంతకం చేసిన 30 సంవత్సరాల తరువాత ఓజోన్ పొరలో రంధ్ర పరిమాణం తగ్గడం గమనించబడింది.
 3. ఓజోన్ క్షీణతకు కారణమయ్యే వాయువుల స్వభావం కారణంగా వాటి రసాయన ప్రభావాలు 50 నుండి 100 సంవత్సరాల వరకు కొనసాగుతాయి.[5]

మూలాలుసవరించు

 1. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (13 September 2019). "రక్షణ కవచాన్ని కాపాడుకొందాం!". www.ntnews.com. మూలం నుండి 16 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 September 2019.
 2. Deepshikha, Singh. "Ms". ABC Live. ABC Live. Retrieved 16 September 2019. Cite news requires |newspaper= (help)
 3. ఆంధ్రజ్యోతి, ప్రత్యేకం (16 September 2015). "ఓజోన్.. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వచ్చేనా?". www.andhrajyothy.com. పీవీవీ ప్రసాదరావు. మూలం నుండి 18 సెప్టెంబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 16 September 2019.
 4. నవతెలంగాణ, బుడుగు-స్టోరి (15 September 2015). "ఓజోన్‌ పరిరక్షణే ధ్యేయం". NavaTelangana. మూలం నుండి 16 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 September 2019.
 5. Dani Cooper. "Hole in the ozone layer is finally 'healing'". ABC News. Australian Broadcasting Corporation. Retrieved 16 September 2019.