అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది.[1] రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది.

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
యితర పేర్లువికలాంగుల దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజుడిసెంబరు 3
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

చరిత్రసవరించు

వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం వికాలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.[2]

అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంసవరించు

వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం గా ప్రకటించింది.[3][4] అలాగే, 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి వికలాంగుల దశాబ్దంగా ప్రకటించింది.[5][6]

కార్యక్రమాలుసవరించు

  1. ఈ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. కాలిబర్‌, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు వంటివి బహుకరిస్తారు.
  2. వివిధ పాఠశాలలోని వికలాంగ విద్యార్థలకు పిల్లలకు ప్లేట్లు, టిఫిన్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు... భవిత కేంద్రంలోని చిన్నారులకు బిస్కెట్లు, క్రీడా సామగ్రిని అందజేస్తారు.
  3. వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారు.[7]

మూలాలుసవరించు

  1. నవతెలంగాణ, మెదక్-స్టోరి (3 December 2015). "నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం". NavaTelangana. Archived from the original on 3 December 2019. Retrieved 3 December 2019.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (2 December 2015). "ఇంకెన్నాళ్లీ వైకల్యం..?". www.andhrajyothy.com. Archived from the original on 3 December 2019. Retrieved 3 December 2019.
  3. వార్త, సంపాదకీయం (2 December 2017). "ప్రభుత్వాల భిన్న వైఖరితో సాగని 'సౌలభ్యభారత్‌'". పి.వెంకటేశం. Archived from the original on 3 December 2019. Retrieved 3 December 2019.
  4. "The International Year of Disabled Persons 1981". UN. Retrieved 3 December 2019.
  5. ప్రజాతంత్ర, హోం (2 December 2019). "నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం". నెరుపటి ఆనంద్‌. Archived from the original on 3 December 2019. Retrieved 3 December 2019.
  6. "United Nations Decade of Disabled Persons 1983–1992". UN Enable. Retrieved 3 December 2019.
  7. ప్రజాశక్తి, జిల్లాలు (3 December 2019). "ఘనంగా వికలాంగుల దినోత్సవం". www.prajasakti.com. Retrieved 3 December 2019.

ఇతర లంకెలుసవరించు