అంతర్జాతీయ విద్యా దినోత్సవం

అంతర్జాతీయ విద్యా దినోత్సవం ( International Day of Education) ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. విద్య అవసరం గుర్తించి ఐక్యరాజ్య సమితి ఈ ఉత్సవం చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు విద్య నాణ్యత మారుతూ ఉంటుంది, మిలియన్ల మంది ఇప్పటికీ ఈ ప్రాథమిక మానవ హక్కును కోల్పోతున్నారు. మెరుగైన విద్యా సంస్కరణల కోసం ప్రచారం చేయడానికి, అందరికీ విద్య అందుబాటులో ఉండటానికి ప్రపంచ వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు[1].

అంతర్జాతీయ విద్యా దినోత్సవం
అధికారిక పేరుఅంతర్జాతీయ విద్యా దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి
ప్రారంభం2019
జరుపుకొనే రోజుజనవరి 24
అనుకూలనంప్రతి సంవత్సరం

చరిత్ర

మార్చు

విద్య మానవ హక్కు, ప్రజా శ్రేయస్సు, ప్రజా బాధ్యతగా ఈ మూడింటిని గుర్థించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ శాంతి, అభివృద్ధి కోసం విద్యను దృష్టిలో పెట్టుకొని, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018 డిసెంబరు 3న జనవరి 24ను అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది[2]. విద్య లేనిదే ఏ దేశం అభివృద్ధి మనుగడ, అభివృద్ధి సాధించలేదు. నాణ్యమైన విద్య అందరికీ లేకుండా, దేశాలు లింగ సమానత్వాన్ని సాధించడం, మిలియన్ల మంది పిల్లలు, యువతను, పెద్దలను నిరాక్ష్యత వైపు మళ్లిస్తూ, దేశాలలో పేదరికాన్ని తొలగించడంలో విజయాన్ని సాధించలేవు. ప్రస్తుతం సుమారు 250 మిలియన్ల పిల్లలు, యువకులు పాఠశాలకు దూరంగా ఉన్నారు, 763 మిలియన్ల పెద్దలు నిరక్షరాస్యులుగా ఉన్నారని పేర్కొంటున్నారు[3].

అవసరం

మార్చు

జీవితాన్ని మెరుగుపర్చుకోవడానికి విద్య ఒక ఆయుధం. మనుషుల జీవితాన్ని మార్చడానికి  ఒక ముఖ్యమైన సాధనం విద్య. ఒక వ్యక్తి జీవన ప్రమాణనాన్ని, నాణ్యతను నిర్ణయిస్తుంది, జ్ఞానం, నైపుణ్యాలను మెరుగుపరచడంలో, వ్యక్తిత్వం, దృక్పథాన్ని విద్య అభివృద్ధి చేస్తుంది. ఉపాధికి చదువు ముఖ్యం. ప్రజల గౌరవప్రదమైన, మంచి జీవనం సాగించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్య ఒక వ్యక్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకునేలా తెలియ చేస్తుంది. విద్య సహాయంతో ఒక వ్యక్తి మరింత పరిణతి చెందుతాడు. ఈ రోజు విద్యను ఒక ప్రజా ప్రయత్నంగా, ఉమ్మడి శ్రేయస్సుగా ఎలా బలోపేతం చేయాలో, డిజిటల్ పరివర్తనను ఎలా నడిపించాలో, ఉపాధ్యాయులకు ఎలా మద్దతు ఇవ్వాలో, భూగోళాన్ని రక్షించాలో, సమష్టి శ్రేయస్సు, మన భాగస్వామ్య ఇంటికి దోహదపడే ప్రతి వ్యక్తిలోని సామర్థ్యాన్ని ఎలా అబివృద్ధి చేయాలో విద్య నిర్ణయిస్తుంది. ఐక్యరాజ్యసమితి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందని, విద్య ద్వారా పేదరిక నిర్ములన ప్రభావాలను తగ్గించే అవకాశాలను ఐక్యరాజ్య సమితి దృష్టి పెట్టి, ఇందుకు విద్య ఒక ముఖ్యమైన అంశం, శక్తి అని [4] విద్యను ఐక్యరాజ్య సమితి ప్రధానంగా భావించి తన వంతు సహాయం చేసే ప్రయత్నాల్లో ఉన్నది.

ఇవి కూడా చదవండి

మార్చు

జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

మూలాలు

మార్చు
  1. Kiani, Tamkeen (2022-08-30). "International Day of Education". National Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-01-06.
  2. Arora, Sumit (2023-01-24). "International Day of Education celebrates on 24 January 2023". adda247 (in Indian English). Retrieved 2024-01-06.
  3. "International Day of Education". https://www.unesco.org/. 06 January 2024. Retrieved 06 January 2024. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help); External link in |website= (help)
  4. "International Day of Education 2023: Know the Theme, History, Significance, Objectives, Celebration, and More". Jagranjosh.com (in ఇంగ్లీష్). 2022-01-24. Retrieved 2024-01-06.