అంతర తామర చెరువులలో, నీటి గుంటలలో పెరిగే నీటి మొక్క. ఇది నాచు జాతికి సంబంధించినది. నీళ్లలో తేలుతుంది. దీని వేళ్లు సన్నగా, దారాల మాదిరిగా కుంచెలాగా ఉంటాయి. ఇది ఎత్తు పెరగదు. దీనికి పూలు. పళ్లు ఉండవు.[1] ఆకు యొక్క భేదము వలన ఇది రెండు రకాలుగా ఉంటుంది.

  • చిన్న ఆకు కలిగినది పద్మాకారంలో ఉంటుంది. పసుపు పచ్చ రంగు కలిసిన ఆకుపచ్చరంగును కలిగి ఉంటుంది. దీని రసము చిక్కగా ఎర్రని రంగులో ఉంటుంది.
  • పెద్ద ఆకులు కలిగినది ఆకుపచ్చరంగు కలిగిఉంటుంది. దీని కాడ 3 అంగుళాల పొడవుతో, చివర ఆకులు కలిగి ఉంటుంది.
అంతర తామర మొక్క

దీనిని తొక్కి, తీసిన రసము పలచగ పసుపు రంగు కలిగి చేదుగా ఉంటుంది. ఈ రెండు దినుసుల మొక్కయందు క్షారము ఉంటుంది. క్షారపాక విధానమును అనుసరించి తీయబడిన క్షారమును తాటిబెల్లములో కలిపి తింటే, శూల కడుపుబ్భరము హరిస్తుంది.

శుద్ధిచేసిన మైలతుర్థ మును చిన్నాకుల అంతర తామర ముద్దలోపెట్టి లఘుపుటము వేస్తే తెల్లగా భస్మమవుతుంది. ఈ జాతి మొక్కలను శరీరమునందువేసి, కట్టినచో శరీరంలోని మంట (దాహరోగము), తక్షణమే తగ్గుతుంది.

మూలములుసవరించు

  1. "సుందరయ్య విజ్ఞాన కేంద్రం జాలగూడువద్ద గల వస్తుగుణదీపము, సత్యనారాయణశాస్త్రి చివుకుల, 1925 ముద్రణ, పేజి నెం 2" (PDF). Archived from the original on 2016-03-10. Retrieved 2014-01-02.
"https://te.wikipedia.org/w/index.php?title=అంతర_తామర&oldid=3262112" నుండి వెలికితీశారు