అందరి ఇల్లు (స్వచ్ఛంద సంస్థ)

అందరి ఇల్లు (ఓపెన్ హౌస్) అనేది హైదరాబాద్ లోని కొత్తపేట్ లో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ. పేద విద్యార్థులకు, నిరుపేద ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి ఏర్పాటు చేయబడిన ఒక తాత్కాలిక గృహమే ఈ అందరి ఇల్లు. ఫీజులు కట్టేందుకు డబ్బులు లేని విద్యార్థుల నుంచి, భోజనం చేయలేనిస్థితిలో ఉన్న సాధారణ వ్యక్తుల వరకు ఎవరైనా ఇక్కడికి వచ్చి అవసరమైనన్ని రోజులు గడపవచ్చు, వారి పనులను పూర్తి చేసుకోవచ్చు. వచ్చిన వారికి నిత్యావసర సరుకులు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తూ డాక్టర్ కామేశ్వరి, డాక్టర్ సూర్యప్రకాష్ దంపతులు ఈ సంస్థను నడుపుతున్నారు.[1]

అందరి ఇల్లు (ఓపెన్ హౌస్)
వ్యవస్థాపకులుడా.కామేశ్వరి సూర్యప్రకాష్
రకంసేవా కార్యక్రమాలు (వసతి, భోజనం, వైద్యం)
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాద్
కార్యస్థానం
  • కొత్తపేట్, హైదరాబాద్
సేవా ప్రాంతాలురెండు తెలుగు రాష్ట్రాలు

స్థాపన మార్చు

ఆకలి సమస్యలే వివిధ ఆరోగ్య సమస్యలకు మూలకారణమని భావించిన ఈ దంపతులు దాన్ని అధిగమించాలన్న లక్ష్యంతో నిరాశ్రయులైన పేదలకు ఆశ్రయం కల్పించడానికి అందరి ఇల్లు (ఓపెన్ హౌస్) ను స్థాపించారు.

సేవా కార్యక్రమాలు మార్చు

ప్రస్తుతం అందరి ఇల్లు ఆశ్రయం లేని మహిళలు, నిరుద్యోగులు వంటి వారికి, ఆహారం, చదవడం వంటి సదుపాయాలు కల్పిస్తుంది. ఇది ప్రజల జీవితాలను వివిధ మార్గాల్లో హత్తుకునే వేదికగా మారింది.

సంతాన సాఫల్య కేంద్రం మార్చు

డాక్టర్ కామేశ్వరి ప్రస్తుత సమాజంలో స్త్రీలు సంతాన విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా స్త్రీల గర్భసంచి ప్రాముఖ్యతను గురించి వివిధ గ్రామాలకు, పట్టణాలకు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే ప్రసవానికి సంబంధించిన కేసులను పరిష్కరిస్తున్నారు.[2]

లైఫ్-హెల్త్ రీ ఇన్‌ఫోర్స్‌మెంట్ మార్చు

డాక్టర్ సూర్యప్రకాష్ 1999లో తన వృత్తిని విడిచిపెట్టి, లైఫ్-హెల్త్ రీ ఇన్‌ఫోర్స్‌మెంట్ గ్రూప్ (లైఫ్-హెచ్‌ఆర్‌జి) అనే ఎన్‌జిఓని "జీవాన్ని రక్షించండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి" అనే నినాదంతో ప్రారంభించారు.

మూలాలు మార్చు

  1. The Hans India (2020-12-19). "Hyderabad Andari illu". Archived from the original on 2022-06-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. New India express.com (2018-04-15). "doctor-couple-from-hyderabad-has-made-saving-the-womb-a-mission". Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)