అంబ్లియోపియా
అంబ్లియోపియా అనేది దృష్టి లోపం, దీనిలో ఒక కన్ను నుండి వచ్చే సంకేతాలను (చూసిన రూపాలను) మెదడు ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ (ప్రాసెస్ )లో విఫలమవుతుంది. కాలక్రమేణా ఆ పరిస్థితి ఇంకో కంటికి అనుకూలంగా మారుతుంది. అయితే ఇది కంటిలో దృష్టి తగ్గడానికి దారితీస్తుంది, లేకపోతే సాధారణంగా కనిపిస్తుంది. పిల్లలు, చిన్నవారిలో ఒకే కంటిలో దృష్టి తగ్గడానికి అంబ్లియోపియా అనేది అత్యంత సాధారణ కారణం[1].
అంబ్లియోపియా | |
---|---|
ఇతర పేర్లు | లేజీ ఐ లేదా మొద్దుబారిన కన్ను |
అంబ్లియోపియాను సరిచేయడానికి అతుక్కునే ఐప్యాచ్ ధరించిన పిల్లవాడు | |
ఉచ్చారణ | |
ప్రత్యేకత | నేత్రవ్యాధులు లేదా కంటి వ్యాధులు |
లక్షణాలు | దృష్టి తగ్గడం , దృష్టి సరిగ్గా లేకపోవడం |
సాధారణ ప్రారంభం | 5 సంవత్సరాలకు ముందు |
కారణాలు | స్ట్రాబిస్మస్, అస్టిగ్మాటిజం, అనిసోమెట్రోపియా, శుక్లం |
రోగనిర్ధారణ పద్ధతి | కంటి /దృష్టి పరీక్షలు |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | మెదడు రుగ్మతలు, కంటి నరాల రుగ్మత, కంటి వ్యాధులు |
చికిత్స | కంటి అద్దాలు, కంటిని కప్పే సాధనం , ప్యాచ్ |
తరుచుదనము | ~2% పెద్ద వారిలో |
కారణాలు
మార్చుబాల్యంలో దృష్టి కేంద్రీకరణకు ఆటంకం కలిగించే ఏదైనా పరిస్థితి ఆంబ్లియోపియాకు కారణం కావచ్చు [1][2]. ఇది కళ్ళ పేలవమైన అమరిక నుండి సంభవించవచ్చు, దృష్టి కేంద్రీకరించడం కష్టంగా ఉండే విధంగా ఒక కన్ను క్రమరహితంగా ఆకారంలో ఉంటుంది, ఒక కన్ను మరొకటి కంటే ఎక్కువ దగ్గర లేదా దూరదృష్టి కలిగి ఉంటుంది లేదా కంటి లెన్స్ మబ్బుగా ఉంటుంది[1]. అంతర్లీన కారణాన్ని పరిష్కరించిన తరువాత కూడా దృష్టి వెంటనే పునరుద్ధరించబడదు, ఎందుకంటే ఈ యంత్రాంగం లో మెదడు కూడా కలిసి ఉంటుంది[2][3]. అంబ్లియోపియాను గుర్తించడం కష్టం, కాబట్టి నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ కంటి దృష్టి పరీక్ష సిఫార్సు చేస్తారు[4].
నివారణ, చికిత్స
మార్చుముందస్తుగా గుర్తించడం వలన చికిత్స సులభమవుతుంది దృష్టిని మెరుగుపరుస్తుంది. కొంతమంది పిల్లలకు అవసరమైన చికిత్సగా కంటికి అద్దాలు ఉపయోగించడం జరుగుతుంది [4]. ఇది సరిపోకపోతే, బలహీనమైన కన్ను ఉపయోగించమని పిల్లలను ప్రోత్సహించడము లేదా బలవంతంగా ఆ కన్ను ఉపయోగించే విధంగా ఉండే చికిత్సలు కూడా ఉంటాయి [1]. ఇది బలమైన కంటి పైన మూసే విధంగా ఒక పాచ్ ను ఉపయోగించడం లేదా బలమైన కంటిలో అట్రోపిన్ ఉంచడం జరుగుతుంది [1][5]. చికిత్స చేయకపోతే అంబ్లియోపియా సాధారణంగా కొనసాగుతుంది. వయసు పెరిగిన కొద్దీ చికిత్స ప్రభావం సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది [1].
ప్రాబల్యం
మార్చుఅంబ్లియోపియా ఐదు సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. పెద్దవారిలో, ఈ రుగ్మత జనాభాలో 1-5% ను ప్రభావితం చేస్తుందని ఒక అంచనా. ఈ చికిత్స దృష్టిని కొంత మెరుగుపరుస్తున్నప్పటికీ, ప్రభావితమైన కన్ను సాధారణ స్థితికి తిరిగి రాదు[4]. ఆంబ్లియోపియా మొట్టమొదట 1600 లలో వివరించాడు[6]. ఈ పరిస్థితి ప్రజలను పైలట్లు లేదా పోలీసు అధికారుల ఉద్యోగాలకి అనర్హులను చేస్తుంది[4]. అంబ్లియోపియా అనే పదం గ్రీకు భాషలో (ἀμβλύς) 'అంబ్లిస్' నుండి వచ్చింది, దీని అర్థం "మొద్దుబారినది" అని, (Δψ ōps) అంటే "దృష్టి" అని.[7]
సూచనలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Facts About Amblyopia". National Eye Institute. September 2013. Archived from the original on 27 July 2016. Retrieved 27 July 2016.
- ↑ 2.0 2.1 Schwartz, M. William (2002). The 5-minute pediatric consult (3rd ed.). Philadelphia: Lippincott Williams & Wilkins. p. 110. ISBN 978-0-7817-3539-1. Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2017.
- ↑ (November 2013). "Linking assumptions in amblyopia".
- ↑ 4.0 4.1 4.2 4.3 (November 2015). "Amblyopia".
- ↑ "Amblyopia (Lazy Eye)". National Eye Institute. 2019-07-02. Archived from the original on 31 January 2020. Retrieved 2020-01-31.
Putting special eye drops in the stronger eye. A once-a-day drop of the drug atropine can temporarily blur near vision, which forces the brain to use the other eye. For some kids, this treatment works as well as an eye patch, and some parents find it easier to use (for example, because young children may try to pull off eye patches).
- ↑ Bianchi PE, Ricciardelli G, Bianchi A, Arbanini A, Fazzi E (2016). "Chapter 2: Visual Development in Childhood". In Fazzi E, Bianchi PE (eds.). Visual Impairments and Developmental Disorders: From diagnosis to rehabilitation Mariani Foundation Paediatric Neurology. John Libbey Eurotext. ISBN 978-2-7420-1482-8. Archived from the original on 8 సెప్టెంబరు 2017. Retrieved 27 జూలై 2016.
- ↑ "Online Etymology Dictionary". www.etymonline.com (in ఇంగ్లీష్). Archived from the original on 8 September 2017. Retrieved 5 May 2017.