అక్బర్ నామా

(అక్బర్‌నామా నుండి దారిమార్పు చెందింది)

అక్బర్‌నామా(పార్శీ: اکبر نامہ), అంటే అక్బర్ యొక్క చరిత్ర అని అర్ధం. ఇది మొఘల్ చక్రవర్తులలో మూడవ వాడైన అక్బరు జీవిత కథ. అక్బర్ జీవిత కాలంలో పర్షియన్ భాషలో వ్రాయబడ్డ గ్రంథము. దీనిని స్వయంగా అక్బర్ ఆజ్ఞపై అబుల్ ఫజల్ చే రచింపబడినది. ఇతను అక్బర్ ఆస్థానంలోని "నవరత్నాల" లో ఒకడు. ఇది పర్షియన్ లో 1600 పుటలకు పైబడిన రచన.

అక్బర్‌నామాలో చిత్రించబడిన అక్బర్ కొలువు

దీనిని "బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ" వారు ఆంగ్లంలో 1897 లో ప్రచురించారు. అనువదించినది హెచ్.బెవరిడ్జ్ అనే ఆంగ్ల ఐ.సి.ఎస్ అధికారి. అనువాదంలోని "ముందు మాట" ప్రకారం అబుల్ ఫజల్ రచనా శైలి అతిశయోక్తులతోను, అవసరానికి మించిన పొగడ్తలతోను కూడి ఉంది. అంతే కాక కొన్ని చోట్ల వాస్తవాలని వక్రీకరించాడు. కానీ అబుల్ ఫజల్ యొక్క ఆ కఠిన రచనా పరిశ్రమ కారణంగానే ఈ రోజు ప్రపంచానికి అక్బరు జీవితం గురించి తెలిసింది.

సుధీర్ఘమైన దైవ సంబంధమైన స్తుతి తరువాత అబుల్ ఫజల్ ఇలా ప్రారంభిస్తున్నాడు - "నేను చాలా కాలం చక్రవర్తి జీవిత విశేషాలను సేకరించడం కోసం ఎంతో మందిని విచారించటంలో గడిపాను. నా యొక్క విషయ సేకరణ నిమిత్తం దేశంలోని అందరు ముఖ్య ఉద్యోగులకు, పూర్వము మొఘలు రాజ్య సేవ నుండి విరమించినవారికి, వారి పదవీ కాలంలో జరిగిన విశేషాలను సవివరంగా వ్రాసి రాజ కొలువునకు పంపిచవలసినదని రాజాజ్ఞలు జారీ అయినాయి. ఆ విధంగా వచ్చిన వివరాలను సంకలనం చేసి మొదట ఒక పుస్తకము గాను, అది పూర్తి అయిన పిమ్మట వచ్చిన వివరాలు రెండవ పుస్తకము గాను వ్రాయటానికి రాజాజ్ఞ అయినది".

అక్బర్ నామా ప్రధానంగా మూడు సంపుటాలు కలిగివున్నది

  • అక్బర్ నామా మొదటి భాగం : అక్బరు వంశ పూర్వజుల గిరించి
  • అక్బర్ నామా రెండవ భాగం : అక్బరు గురించి
  • అక్బర్ నామా మూడవ భాగం : అక్బరు సామ్రాజ్యం లేదా మొఘల్ సామ్రాజ్యం గురించిన గ్రంథం ఆయిన ఎ అక్బరీ.

ఇవీ చూడండి

మార్చు

పాదపీఠికలు

మార్చు


మూలాలు

మార్చు
  1. Beveridge Henry. (tr.) (1907, Reprint 2000). The Akbarnama of Abu´l Fazl, Vol. I, Kolkata: The Asiatic Society, ISBN 81-7236-092-4.
  2. Beveridge Henry. (tr.) (1907, Reprint 2000). The Akbarnama of Abu´l Fazl, Vol. II, Kolkata: The Asiatic Society, ISBN 81-7236-093-2.
  3. Beveridge Henry. (tr.) (1939, Reprint 2000). The Akbarnama of Abu´l Fazl, Vol. III, Kolkata: The Asiatic Society, ISBN 81-7236-094-0.

ఆన్-లైన్

మార్చు

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.