అక్షయ్ వెంకటేష్

అక్షయ్ వెంకటేష్ (జ.1981 నవంబరు 21) గణిత శాస్త్రజ్ఞుడు. న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్‌ (36) రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అక్షయ్‌కు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రలంటే చాలా ఇష్టం. ఇప్పటికే గణిత శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను పలు పురస్కారాలను అందుకున్నాడు.[1]

అక్షయ్ వెంకటేశ్
జననం (1981-11-21) 1981 నవంబరు 21 (వయసు 42)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయతఆస్ట్రేలియన్
రంగములుగణిత శాస్త్రం
వృత్తిసంస్థలుఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ (2005–2006, 2018–ప్రస్తుతం)
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (2008–2018)
కోరంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ (2006–2008)
చదువుకున్న సంస్థలుప్రిన్సిటన్ విశ్వవిద్యాలయం
వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)పీటర్ సర్నాక్
ప్రసిద్ధిగణితశాస్త్ర సేవలు,
ముఖ్యమైన పురస్కారాలుసేలం ప్రైజ్ (2007)
శాస్త్ర రామానుజన్ ప్రైజ్ (2008)
ఇన్ఫోసిస్ ప్రైజ్ (2016)
ఆస్ట్రోస్కీ ప్రైజ్ (2017)
ఫీల్డ్స్ మెడల్ (2018)

ప్రారంభ సంవత్సరాలు మార్చు

వెంకటేష్ భారతదేశంలోని ఢిల్లీలో జన్మించాడు. అతని కుటుంబం తాను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ కు వలస వెళ్ళింది. అతను స్కాచ్ కాలేజీలో చదివాడు. అతని తల్లి స్వెతా డీకిన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. బాల మేథావి అయిన వెంకటేష్ రాష్ట్ర గణిత ఒలింపియాడ్ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం నిర్వహించే పాఠ్యేతర శిక్షణా తరగతులకు హాజరయ్యాడు.[2] 1993 లో కేవలం 11 ఏళ్ళ వయసులో, వర్జీనియాలోని విలియంబర్గ్ లో జరిగిన 24 వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు.[3] మరుసటి సంవత్సరం, అతను గణితంపై తన దృష్టిని మార్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్‌లో రెండవ స్థానంలో నిలిచిన తరువాత,[4] 6 వ ఆసియా పసిఫిక్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[5] 1994 లో హాంకాంగ్‌లో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో కాంస్య పతకం సాధించాడు. అతను అదే సంవత్సరం తన మాధ్యమిక విద్యను పూర్తి చేశాడు.[6] వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించే ముందు 13 ఏళ్ళ వయసులో అక్కడ చదివిన అతి పిన్న వయస్కుడుగా చరిత్రకెక్కాడు. వెంకటేష్ మూడేళ్ళలో నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసి 16 ఏళ్ళ వయసులో విశ్వవిద్యాలయం నుండి ప్యూర్ మాథమెటిక్స్‌లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ సంపాదించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.[6] సైన్స్, ఇంజనీరింగ్, డెంటిస్ట్రీ, లేదా మెడికల్ సైన్స్ ఫ్యాకల్టీల నుండి సంవత్సరంలో అత్యుత్తమ గ్రాడ్యుయేట్ గా జె. ఎ. వుడ్స్ మెమోరియల్ ప్రైజ్ పొందాడు.[7][8] యుడబ్ల్యుఎలో ఉన్నప్పుడు అతను ఆనర్స్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[9]

పరిశోధనా సేవలు మార్చు

వెంకటేష్ 1998 లో పీటర్ సర్నాక్ ఆధ్వర్యంలో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో పి హెచ్‌ డి ప్రారంభించాడు. అతను దానిని 2002 లో పూర్తి చేశాడు.[10] అతను లిమిటింగ్ ఫార్మ్స్ ఆఫ్ ద ట్రేస్ ఫార్ములాను రూపొందించాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనం కోసం హాకెట్ ఫెలోషిప్ అతనికి సహాయపడింది. ఆ తరువాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టోరల్ పదవి పొందాడు. అక్కడ అతను C.L.E. మూర్ బోధకునిగా పనిచేసాడు. వెంకటేష్ 2004 నుండి 2006 వరకు క్లే మ్యాథమెటిక్స్ ఇనిస్టిట్యూట్ నుండి క్లే రీసెర్చ్ ఫెలోషిప్ పొందాడు.[10] న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని కొరెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ నైన్సెస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసాడు[11][12] అతను 2005 నుండి 2006 వరకుఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ (IAS) లో స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సభ్యునిగా ఉన్నాడు. 2008 సెప్టెంబరు 1 న స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తిగా ప్రొఫెసర్ అయ్యాడు. 2017-2018లో IAS లో విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసిన తరువాత,[11] అతను 2018 ఆగస్టు మధ్యలో శాశ్వత అధ్యాపక సభ్యునిగా IAS కి తిరిగి వచ్చాడు.[13]

పురస్కారాలు మార్చు

 • సేలం పురస్కారం - గణిత శాస్త్రంలో ఫోరియర్ శ్రేణి సిధ్దాంతంపై చేసిన కృషికి అంజజేసారు.[14]
 • 2007లో పలక్కాడ్ ఫెలోషిఫ్
 • 2008లో శాస్త్ర రామానుజన్ పురస్కారం[6][15]
 • 2010లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమెటిక్స్ లో ఉపన్యాసకునిగా ఆహ్వానం[16]
 • 2016లో ఇన్ఫోసిస్ పురస్కారం - మేథమెటికల్ సైన్స్ విభాగంలో[17]
 • 2017లో ఆస్ట్రాస్కీ పురస్కారం[18]
 • 2018లో ఫీల్డ్ మెడల్.[19][20]

మూలాలు మార్చు

 1. "భారత సంతతి వ్యక్తికి అరుదైన పురస్కారం". 2018-08-07.
 2. Schultz, Phill (24 January 2005). "My Automathography – 30 Years at UWA". University of Western Australia. Archived from the original on 24 మార్చి 2015. Retrieved 4 August 2018.
 3. "XXIV International Physics Olympiad Williamsburg". 1993. Archived from the original on 5 ఫిబ్రవరి 2012. Retrieved 4 జూన్ 2020.
 4. "Highest AMO scorers, 1994". Australian Mathematics Trust. Archived from the original on 24 March 2012. Retrieved 7 June 2013.
 5. "Results of 6th Asian Pacific Mathematics Olympiad 1994". Australian Mathematics Trust. Archived from the original on 29 April 2013. Retrieved 7 June 2013.
 6. 6.0 6.1 6.2 "Former IMO Olympians". amt.edu.au. Australian Mathematics Trust. 2017. Archived from the original on 13 డిసెంబరు 2018. Retrieved 4 August 2018.
 7. "Conditions – J. A. Wood Memorial Prizes [F1495-03]". University of Western Australia. 3 November 2015. Archived from the original on 4 జూన్ 2020. Retrieved 4 August 2018.
 8. Stacey, David (2 August 2018). "UWA maths prodigy wins international award" (Press release). University of Western Australia. Archived from the original on 4 ఆగస్టు 2018. Retrieved 4 August 2018.
 9. "Honours Cricket Association". Honours Cricket Association. Archived from the original on 13 డిసెంబరు 2002. Retrieved 22 August 2019.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 10. 10.0 10.1 "Akshay Venkatesh". claymath.org. Clay Mathematics Institute. 2 August 2018. Archived from the original on 4 ఆగస్టు 2018. Retrieved 4 August 2018.
 11. 11.0 11.1 "Akshay Venkatesh". Institute for Advanced Study. 2018. Archived from the original on 2 ఆగస్టు 2018. Retrieved 4 August 2018.
 12. "Akshay Venkatesh – Research Interests". math.stanford.edu. Stanford University. Archived from the original on 25 జూన్ 2018. Retrieved 4 August 2018.
 13. "Mathematician Akshay Venkatesh Appointed to the Faculty of the Institute for Advanced Study" (Press release). Institute for Advanced Study. 2018. Archived from the original on 1 ఆగస్టు 2018. Retrieved 6 August 2018.
 14. "NYU's Venkatesh, 25, Wins Prize Given to Young Mathematicians for Work in Field of Analysis" (Press release). New York University. 22 August 2007. Retrieved 4 August 2018.
 15. "Venkatesh Awarded 2008 SASTRA Ramanujan Prize" (PDF). Notices of the AMS. 56 (1): 56. January 2009.
 16. "ICM Plenary and Invited Speakers since 1897". mathunion.org. International Mathematical Union. 11 June 2016. Archived from the original on 11 June 2016. Retrieved 16 May 2016.
 17. "Infosys Prize – Laureates 2016 – Prof. Akshay Venkatesh". www.infosys-science-foundation.com. Archived from the original on 2017-04-04. Retrieved 2017-04-03.
 18. "Citation for Akshay Venkatesh" (PDF). ostrowski.ch. Ostrowski Foundation. 2017. Retrieved 4 August 2018.
 19. "Fields Medals 2018". mathunion.org. International Mathematical Union. 2018. Archived from the original on 5 ఆగస్టు 2018. Retrieved 4 August 2018.
 20. Keane, Daniel (2 August 2018). "Maths hands out its 'Nobel Prize' to an Australian – here's why you should care". ABC News. Retrieved 2 August 2018.

బాహ్య లంకెలు మార్చు