అక్షర ఇంటర్నేషనల్ స్కూల్
అక్షర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ 2010 లో తన మొదటి పాఠశాలను స్థాపించింది.
అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ | |
---|---|
లక్ష్యం | Where Playing is Learning |
ఆవిర్భావం | 2010 |
రకం | Private International School |
ప్రధానకార్యాలయాలు | Hyderabad, Telangana |
స్థానం | Ayyappa Society, 35,Kahurihills, 100 Feet Rd, towards, Jubilee Hills, Hyderabad, Telangana 500033 |
ప్రముఖులు | జగన్ మోహన్ రావు అరిశనపల్లి |
అనుబంధ సంస్థలు | CBSE |
జాలగూడు | https://www.akshara.edu.in/ |
స్థాపన
మార్చు2010 సంవత్సరంలో ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త జగన్ మోహన్ రావు అరిశనపల్లి ఈ విద్యాసంస్థలను స్థాపించారు.
ప్రస్థానం
మార్చుఅక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ 2010 లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. క్రీడామైదానాలు ఈ పాఠశాల ప్రత్యేకత. వీరి అన్నిపాఠశాలలలో క్రీడామైదానం ఉన్నది. అతి స్వల్ప వ్యవధిలో హైదరాబాద్ నగరమంతా విస్తరించి అక్షర నాణ్యమైన విద్యను అందిస్తోంది. అత్యుత్తమ స్థాయి బోధనా సాధనాలు, మిళితమైన పాఠ్యాంశాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను తమ పాఠశాలల్లో కల్పించింది.
రాబోయే కొన్ని ఏళ్లలో రాష్ట్రమంతా అన్ని ముఖ్య పట్టణాలలో తమ పాఠశాలలును ఏర్పరిచేవిధంగా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ కృషి చేస్తున్నది. అభివృద్ధి చెందుతున్న విద్యా రంగపు డిమాండ్లు, సవాళ్ళ ప్రకారం ఉత్తమమైన విద్యను సరికొత్తగా అందించడానికి పాఠశాల ప్రయత్నిస్తున్నది.
తరగతులు
మార్చుప్రస్తుతం ఈ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్య అందుబాటులో ఉన్నది, అతి త్వరలోనే 11, 12 వ తరగతులను కూడా ప్రారంభించనున్నారు.
పాఠశాలలు
మార్చుతెలంగాణ రాష్ట్రంలో ఈ పాఠశాల 7 బ్రాంచులను ఏర్పాటు చేసింది.[1]
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, కూకట్ పల్లి , హైదరాబాద్
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, సుచిత్ర, హైదరాబాద్
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఎల్.బి. నగర్, హైదరాబాద్
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఎ.ఎస్.రావు నగర్, హైదరాబాద్
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, నాదార్గుల్,హైదరాబాద్
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, కరీంనగర్
- అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఉప్పల్ , హైదరాబాద్
ప్రవేశం
మార్చుఈ పాఠశాలలో విద్యార్ధి చదవడానికి అర్హత పొందాలంటే విద్యార్ధి మౌఖిక పరీక్షకు, తల్లిదండ్రులు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
సామాజిక సేవ
మార్చురాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ సంఘానికి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ అండగా నిలిచింది. అవసరమైన నూతన క్రీడా పరికరాల కొనుగోలు కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించింది.