అగరు కుటుంబము

అగరు చెట్టు కొండల మీద బెరుగును. లే కొమ్మల మీద పట్టు వంటి రోమములు గలవు.

ఆకులు
ఒంటరి చేరిక. లఘు పత్రములు బల్లెపాకారము. పొడవు 2 - 3/2 అంగుళములు. విషమ రేఖ పత్రము. సమాంచలము కొన వాలము గలదు.
పుష్పమంజరి
రెమ్మ గుత్తి. తెలుపు ఎక లింగ పుష్పములు.
పుషనిచోళము
సంయుక్తము 5 తమమెలు అల్లుకొని యుండును నీచము.
కింజల్కములు
. 10 కాడలు మిక్కిలి పొట్టివి పుప్పొడి తిత్తులు వెడల్పుగా నుండును. కింజల్కములకు పైన 5 పొలుసులు గలవు.
స్త్రీ పుష్పము
పుష్ప నిచోళము. పైదాని వలెనే యుండును.

అండాశయము అండ కోశము: ఉచ్చము రెండు గదులు. కీళము మిక్కిలి పొట్టి. గింజలు వ్రేలాడు చుండును.

ఈ కుటుంబపు చెట్లు విస్తారము శీతల దేశములలో పెరుగును. ఆకులు ఒంటరి చేరిగా నైనను, అభిముఖ చేరికగా నైనను వుండును. లఘు పత్రములు సమాంచలము. పుష్పనిచోళమే గలదు. ఏక లింగ పుష్పములు. అండాశయము గదిలో నొక్కొక గింజయే యుండును.

అగరు చెట్టు కాశ్మీర దేశ ప్రాంతముల కొండల మీద సాధారణముగ ఆరువది అడుగుల ఎత్తు పెరుగును. దాని మాను యొక్క కైవారము 5 మొదలు 8 అడుగుల వరకు వుండును. ఇరువదేండ్లు ; అ వృక్షమైన పిదప అగరు కొరకు దానిని నరక వచ్చునందురు గాని కొందరు మంచియగరేబది సంవత్సరములలోపున రాదందురు. ఎన్ని సంవత్సరములు (నరికి యుంచినను) నరుకక యుంచినను నన్ని చెట్ల యందునగరు లభించదు. కొన్ని చెట్ల యందు మాత్రము మాను లోను కొమ్మల యందును ముక్క ముక్కలవలే నగరేర్పడును. ఈ కారణము వల్ల నిట్లేర్పడు చున్నదో తెలియ వచ్చుట లేదు. నే చెట్టు నందేర్పడినది నరికిన గాని తెలియదు. అగరులే చిట్లంత ఉపయోగ కారులు కావు. కలపకును సువాసనయుండక తేలిగ గానుండును. అగరు నకు మంచి పరిమళము గలదు. పన్నీరు వలే దీనిని శుభ కార్యములందు ఉపయోగించురు. దీని తోడనే అగరు వత్తులను చేయుదురు. కాని ఇతర పరిమళ ద్రవ్యములతో కూడ వత్తులుచేసే వానినే అగరు వత్తులని అమ్ముచున్నారు. సాధారణముగా అంగళ్ళ యందుండు అగరు నూనెయు నిజముగా అగరు నుండి చేసినదే యని నమ్ముటకు వీలు లేదు, అగరును కొందరు ఔషథముల యందు కూడ ఉపయోగించు చున్నారు.

కాగితములు చేయక పూర్వము అగరు బెరడులను బలుచగ చీల్చి వానిమీద గొందరు వ్రాసెడు వారు. కాగితములు వచ్చిన గొంత కాలము వరకు కూడ మంత్రవేత్తలగు బ్రాహ్మణులు యోగులును యంత్ర శాలలందుజేసిన కాగితము లంటరాదని ఈ బెరడు చీలికలమీదనే వ్రాయుచు వచ్చిరి.