అగ్ని భద్రత అనేది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు చేయగల అగ్నిప్రమాదాలు ఏర్పడగల సంభావ్యతని తగ్గీంచడం లేదా పూర్తిగా నివారించడం కోసం, ఏదేని భవనం అనియంత్రిత అగ్ని ప్రమాదకాలంలో ఉన్నపుడూ అందలి వ్యక్తులను హెచ్చరించడానికీ, కాపాడడానికీ, ప్రాణ నష్ట తీవ్రతని తగ్గించడానికీ సంబంధించింది. అగ్ని భద్రతా ప్రమాణాలు అనేవి కొత్త భవనాల నిర్మాణంలో ఉండగా నిర్దేశింపబడేవి లేదా అప్పటికే కట్టబడిన భవనాలలో పాటింవలసినవి, అందలి నివాసితులు కచ్చితంగా పాటించవలసినవి, ఇలా చాలా విధాలుగా ఉంటాయి.

అగ్ని భద్రతా విధానంలోని ప్రధానాంశాలు

మార్చు
 
  • స్థానిక భవనం కోడ్ యొక్క సంస్కరణ అనుగుణంగా ఒక సౌకర్యాన్ని నిర్మించటం
  • ఒక సౌకర్యాన్ని నిర్వహించడం, అగ్ని కోడ్ యొక్క నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం. అది ఆ భవన నివాసితులు లేదా నిర్వాహకులు, ఆ భవనానికి సంబంధించిన నిబంధనలు, నిపుణులిచ్చిన సలహాలపైన ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది.

ఈ ఉదాహరణలు:

  • భవనంలోని ఏ భాగాన్నీ గరిష్ఠ పరిమితిని మించి వాడకపోవడం
  • సరైన అగ్ని నిష్క్రమణ ద్వారాలను నిర్వహించడం, సరైన నిష్క్రమణ చిహ్నాలను ఏర్పరచడం (ఉదా: నిష్క్రమణ చిహ్నాలు సామర్థ్య వైఫల్య సమయంలో సరైన నిర్దేశనానికి ఉపయోగపడతాయి)
  • విద్యుత్ లోపాలవల్ల లేదా పేలవమైన వైర్ ఇన్సులేషన్ వల్ల, పరిమితికి మించిన విద్యుత్ప్రవాహం వల్ల తీగలు, కండక్టర్లు పెనువత్తిడికి గురి కావడం వల్ల, వేడెక్కిపోవడాన్ని, కాలిపోవడాన్ని ఆపడానికి విద్యుత్ కోడ్ గురించి అవగాహన కలిగి ఉండాలి.
  • సరైన అగ్ని నివారకాలను ఏర్పాటుచేయడం, వాటికి సరిగ్గా నిర్వహించడం.
  • భవనానికి కావలసినవైనప్పటికీ ప్రమాదకారంగా కాగల పదార్థాలను సరైన విధంగా నిల్వచేసుకోవాలి, వాడుకోవాలి.
  • నిర్మాణంలోని కొన్ని ప్రదేశాలలో దహనశీల పదార్థాలను నిషేధించడం.
  • సమయానుగుణంగా భవనాన్ని పర్యవేక్షించడం, లోపాలని సవరించేవరకూ తగు ఆదేశాలు జారీచేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం, లేదా భవనాన్ని పూర్తిగా మూయించివేయడం వంటివి.

కొన్ని సాధారణ అగ్ని ప్రమాదాలు

మార్చు

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు