అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్
భారతదేశపు మొదటి అగ్రికల్చరల్ డేటా మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ (ఏ డి ఈ ఎక్స్ ) ను 2023 ఆగస్టు 11వ తేదీన తెలంగాణ ఐటి శాఖ మంత్రి తారక రామారావు ప్రారంభించారు[1]. దీన్ని ప్రపంచ ఆర్థిక వేదిక, జాతీయ శాస్త్ర సాంకేతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, స్టార్టప్ ల ద్వారా వ్యవసాయ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు డేటా ఎక్స్చేంజ్ సెంటర్ ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేలల రకాలు, సాగవుతున్న పంటలు, అందుబాటులో ఉన్న సాంకేతికత తదితర సమగ్ర వివరాలు ఈ ఎక్స్చేంజిలో అందుబాటులో ఉంటాయి. ఇది ఆహార వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రం పురోగమనానికి తోడ్పడుతుంది.
మూలాలు :
- ↑ Today, Telangana (2023-08-11). "Telangana: KTR launches India's first Agricultural Data Exchange platform". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-18.