అచింత షూలి (జ.2001 జనవరి 24) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్. ఆయన 2022లో జరిగిన కామ‌న్వెల్డ్ గేమ్స్‌లో పురుషుల 73 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.[2][3]

Achinta Sheuli
Sheuli in August 2022
వ్యక్తిగత సమాచారం
జాతీయతIndian
జననం (2001-11-24) 2001 నవంబరు 24 (వయసు 23)
Deulpur, Howrah district, West Bengal, India[1]
క్రీడ
క్రీడWeightlifting
పోటీ(లు)73 kg

2022 కామన్వెల్త్ ఆటలలో అతను 313 కి.గ్రా ల రికార్డును చేసి బంగారు పతకాన్ని సాధించాడు. అతను స్నాచ్ లో 143 కి.గ్రా లను మరియు క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 170 కి.గ్రా ల బరువును ఎత్తాడు.

2021 జూనియర్ వెయిట్ లింప్టింగ్ ఛాంపియన్ షిప్ లో రజత పతకాన్ని గెలుపొందాడు. రెండు సార్లు కామన్వెల్త్ ఛాంఫియన్ షిప్స్ లలో బంగారు పతకాలను సాధించాడు.[4]

జీవిత విశేషాలు

మార్చు

షెలీ హౌరా జిల్లాలోని పంచ్లాలోని దేవల్‌పూర్‌లో దిగువ మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. అతను దేవల్పూర్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను 2011లో వెయిట్‌లిఫ్టింగ్ ప్రారంభించాడు. అతని తండ్రి ప్రతీక్ షెలీ కార్మికుడు, అతను ఏప్రిల్ 2013లో మరణించాడు. అతని అన్నయ్య అలోక్ కూడా వెయిట్‌లిఫ్టర్.

హర్యానాలో జరిగిన యూత్ నేషనల్ గేమ్స్‌లో షెలీ పాల్గొని మూడో స్థానంలో నిలిచాడు. అతను 2013లో 50 కేజీల వెయిట్ క్లాస్‌లో జూనియర్ జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. 2014లో పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశించే అవకాశాన్ని పొందాడు.

మూలాలు

మార్చు
  1. Banerjee, Sayak (4 February 2020). "Lifter Achinta mulls state switch". The Telegraph. India. Retrieved 27 September 2022.
  2. Andhra Jyothy (1 August 2022). "కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటిన 20 ఏళ్ల యువ తేజం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం." (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  3. Eenadu (1 August 2022). "ఆ అన్న త్యాగం.. తమ్ముడి మెడలో పసిడై మెరిసింది." Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  4. "Achinta Sheuli stitches a new life on the weightlifting platform". The Indian Express (in ఇంగ్లీష్). 6 September 2019. Retrieved 29 July 2022.