అటల్ పెన్షన్ యోజన

అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 సంవత్సరం మే 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు[1]. ఈ పథకం ద్వారా చంద్రదారుడు చెల్లించే మొత్తాన్ని బట్టి నిర్దేశిత పెన్షన్ ను అందజేయడం జరుగుతుంది[2]. వారు చెల్లించిన దానిని బట్టి, ఈ పథకం చెందాదారులు 60 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత నెలకు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ.4,000 లేదా రూ.5,000 నెలవారి పెన్షన్ ను పొందుతారు[3]. వారు చెల్లించే మొత్తం వారు వయసు పై ఆధారపడి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన పథకం బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపు దారులు 2022 అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ పథకానికి అనర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మూలాలు :

  1. "Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన పథకం అంటే ఏమిటి? దాని వలన కలిగే ప్రయోజనాలు..." The Economic Times Telugu. Retrieved 2024-01-23.
  2. "అటల్ పెన్షన్ యోజన : భార్యాభర్తలిద్దరూ పెన్షన్ పొందొచ్చు". Samayam Telugu. Retrieved 2024-01-23.
  3. Velugu, V6 (2023-06-03). "అటల్ పెన్షన్ యోజన...ఎంత కడితే ఎంత పొందవచ్చు". V6 Velugu. Retrieved 2024-01-23.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)