అటాను సబ్యసాచి నాయక్

భారతీయ రాజకీయ నాయకులు

అటాను సబ్యసాచి నాయక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహాకాలపడ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం, సహకార శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

అటాను సబ్యసాచి నాయక్
అటాను సబ్యసాచి నాయక్


ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం, సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – ప్రస్తుతం
నియోజకవర్గం మహాకాలపడ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1967 మే 07
అరిలో, టెండకుడ, కేంద్రపడా జిల్లా, భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు రాజ్ కిషోర్ నాయక్
జీవిత భాగస్వామి బంధన ఖుంటియా

రాజకీయ జీవితం

మార్చు

అటాను సబ్యసాచి నాయక్ బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మహాకాలపడ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న జఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం, సహకార శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు

మార్చు
  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.