అట్లాంటా హిందూ దేవాలయం
అట్లాంటా హిందూ దేవాలయం, జార్జియాలోని రివర్‌డేల్‌లో ఉన్న హిందూ దేవాలయం. మెట్రో అట్లాంటాలోని హిందువులు ప్రతినిత్యం ఇక్కడికి వస్తుంటారు.
అట్లాంటా హిందూ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | జార్జియా |
ప్రదేశం: | రివర్‌డేల్ |
అక్షాంశ రేఖాంశాలు: | 33°35′43″N 84°24′31″W / 33.5954°N 84.4087°W |
చరిత్ర
మార్చు1970వ దశకం చివరిలో, అట్లాంటాలో ఒక హిందూ దేవాలయం నిర్మించాలని అక్కడి ప్రవాస భారతీయులు నిర్ణయించుకున్నారు. డా.ఎస్.పి. రెడ్డి, బి.కె. మోహన్, శైలేంద్ర, హరి ఉపాధ్యాయ, డా. వానపల్లి, ఎస్ ఐ నాయుడు, ఐ.జె. రెడ్డి తదితరులు కలిసి 1982లో ఒక అసోసియేషన్ ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరూ $10,000 విరాళంగా అందించడంతోపాటు, మరికొంత డబ్బును సేకరించారు. దేవాలయ నిర్మాణంకోసం మిసెస్ జ్యువెల్ పి. క్విన్ నుండి భూమిని కొనుగోలు చేసారు. 1984, అక్టోబరు 14న దేవాలయ నిర్మాణం ప్రారంభమై కొద్దికాలంలోనే పూర్తయింది. సంపత్‌కుమార్ భట్టార్, దేవాలయ వాస్తుశిల్పి పద్మశ్రీ ముత్తయ్య స్తపతి ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ తయారుచేశారు. 1990లో దక్షిణ భారత సంప్రదాయ శైలీలో ఈ దేవాలయం నిర్మించబడింది.[1]
నిర్మాణ శైలీ
మార్చుఇక్కడ వెంకటేశ్వరస్వామి, శివుడు ప్రధాన దేవుళ్ళుకాగా, ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర దేవతలకు మందిరాలు కూడా ఉన్నాయి.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Inception of Hindu Temple of Atlanta". Hindu Temple of Atlanta (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-21. Retrieved 2022-01-21.
- ↑ Wuthnow, Robert (2007). America and the Challenges of Religious Diversity. Princeton University Press. p. 38. ISBN 0-691-13411-1.
- ↑ Byrne, Mary M. (2004-05-22). "Hindu temple traditions part of immigrants' new lives here". The Seattle Times. Retrieved 2009-01-20.