అడపా తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

ప్రముఖ వ్యక్తులు మార్చు

ఈ ఇంటిపేరు కలిగినవారిలో ప్రముఖ వ్యక్తుల పేర్లు:

అర్థం మార్చు

అడపమంటే వక్కలు, ఆకులు మొదలైన తాంబూలపు ద్రవ్యాలుంచే సంచి. దీనిని సంబెళమని కూడా అంటారు. కృష్ణరాయల కాలంలో అందరూ ఎక్కడికి వెళ్లినా తమ తాహతుకు తగ్గ అడపాన్ని ఒకటి పట్టుకొని వెళ్ళేవారు. అడపం గురించిన వర్ణనలు కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద 7వ ఆశ్వాసంలోని ఏడవ పద్యంలో కనిపిస్తోంది. కృష్ణరాయల కాలంలో సంపన్నులు, కులీనులు అనుభవించే భోగాల్లో భాగమైన తాంబూలానికి అప్పట్లో వివిధ రకాలైన మెరుగులు, రుచులతో అలవాట్లు తయారయ్యాయి. ఈ నేపథ్యంలో విజయనగర చక్రవర్తులైన కృష్ణదేవరాయల ఆంతరంగిక పరివారంలో తాజా సరుకులను సేకరిస్తూ తాంబూలం తయారుచేసేందుకు కూడా ఒక విభాగమే ప్రత్యేకించి ఉండేది. ఈ విభాగంలో అనేక హోదాల్లో గొప్ప ఉద్యోగాల వరకూ ఉండేవి. ఈ ఉద్యోగస్తుల్లో ముఖ్యునిగా కాశ్యపగోత్రోద్భవుడైన తిమ్మప్పనాయకుడి కుమారుడు బయ్యప్ప ఉండేవారు. కృష్ణదేవరాయల కాలంలో, అచ్యుత దేవరాయల కాలంలో ఈ ఉద్యోగాన్ని బయ్యప్పయే చేసేవాడు. అతను తిరుపతి వేంకటేశ్వరస్వామికి 55,310 నార్పణములు చెల్లించుకున్నట్లు 1531లో చెక్కించిన శాసనం ద్వారా తెలుస్తూంది. ఇంకొన్ని గ్రామాలను సైతం వేంకటేశ్వరస్వామికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణాలచే ఆయన గొప్ప శ్రీమంతుడై ఉంటాడన్న అంచనాకు చరిత్రకారులు వచ్చారు.[1] వీటన్నిటి నేపథ్యంలో అడపా అనే ఇంటిపేరుకున్న అర్థం కృష్ణదేవరాయల కాలంలోని ఆంతరంగిక విభాగాన్నో, అందులోని ఉద్యోగాన్నో సూచిస్తోందని తెలుస్తోంది.

మూలాలు మార్చు

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అడపా&oldid=3848024" నుండి వెలికితీశారు